బ్రిటన్ రాజకుటుంబంలో భారీ కుదుపు జరిగింది. అగ్ర రాజ్యం అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం రాజకుటుంబంలో రక్తసంబంధానికి చీలిక తెచ్చింది.. జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ స్కామ్ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, ధనవంతులతో పాటు బ్రిటన్ యువరాజు ఆండ్రూ పేరు కూడా ఉంది.
ప్రధాని మోడీ-యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఆహ్లాదకరంగా గడిపారు. ముంబైలో చాలా ఉల్లాసంగా కనిపించారు. రెండు రోజుల పర్యటన కోసం యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఇండియాకు వచ్చారు. గురువారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
భారత్-యూకే సహకారం కొత్త శిఖరాలకు తీసుకెళ్లబోతున్నాయని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబైలో ఇండియా-యూకే సీఈవో ఫోరమ్‌లో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను వేల కోట్లలో మోసం చేసి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అప్పగింతకు లైన్‌క్లియర్ అయినట్లు తెలుస్తోంది. భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమం అయినట్లు సమాచారం.
యూకేలోని మాంచెస్టర్ సినాగోగ్‌లో ఓ దుండగుడు వీరంగం సృష్టించాడు. యూదుల ప్రార్థనా మందిరం వెలుపల ఉన్న వారిని వాహనంతో ఢీకొట్టి.. అనంతరం కత్తితో వీరంగం సృష్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. నలుగురు గాయపడ్డారు.
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా తేదీలు ప్రకటించనప్పటికీ అక్టోబర్ చివరి నాటికి భారత్‌లో పర్యటించే ఛాన్సుందని తెలుస్తోంది. ఇక ముంబైలో జరిగే ఫిన్‌టెక్ సమావేశంలో కూడా కీర్ స్టార్మర్ పాల్గొంటారని సమాచారం.
యూకేలో దారుణం జరిగింది. 20 ఏళ్ల సిక్కు యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం జాత్యహంకార వ్యాఖ్యలకు పాల్పడ్డారు. ‘‘నీ దేశానికి తిరిగి వెళ్లిపో’’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితుల సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
యునైటెడ్ కింగ్డమ్ చరిత్రలో సరికొత్త అధ్యయనం లిఖితమైంది. హోం కార్యదర్శిగా తొలిసారి ఒక ముస్లిం మహిళ నియమితులయ్యారు. షబానా మహమూద్ హోం కార్యదర్శిగా నియమితులయ్యారు.
ప్రధాని మోడీ మరో రెండు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. జూలై 23-26 తేదీల్లో యూకే, మాల్దీవుల్లో మోడీ పర్యటించనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ తెలిపింది. ఇటీవలే ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనకు వెళ్లొచ్చారు. కొద్ది రోజుల గ్యాప్‌లనే మరో రెండు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు.