ఇంటికి ఇంటికి మధ్య గ్యాప్‌లు ఉండటం సహజమే. అయితే, ఒక వీధి రోడ్డు నుంచి మరో వీధి రోడ్డులోకి వెళ్లడానికి రోడ్డు క్రాస్ చేసి వెళ్లాలి లేదా వీధి గుండా వెళ్లాలి. రెండు ఇళ్ల మధ్యగుండా ఖాళీ స్థలం ఉండి, ఆ ఖాళీ స్థలం గుండా ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డుకు ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకు వెళ్లే అవకాశం ఉంటే దానిని వీధి అని పిలుస్తారు. వీధి అంటే విశాలంగా ఉంటాయి. కనీసం ఓ చిన్న కారు, మనుషులు నడిచేందుకు వీలుగా ఉంటాయి. కానీ, ఆ వీధి అలా కాదు. కొద్దిమాటి లావుగా ఉన్న వ్యక్లి లోపలికి వెళ్తే మధ్యలోనే ఇరుక్కుపోతాడు. 1.1 అడుగులున్న ఆ వీధిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లోకి ఎక్కించారు.
Read: మరో సంచలన ప్రయోగానికి సిద్దమవుతున్న ఎలన్ మస్క్… కార్బన్‌డైఆక్సైడ్‌తో..
జర్మనీ భూభాగ లెక్కల ప్రకారం ఈ వీథికి రెండు వైపులా ఉన్న భవనాలు మున్సిపాలిటీ పరిధిలోకి వస్తాయి. 1820లో ఈ వీధిని అధికారికంగా పబ్లిక్ స్ట్రీట్ 77గా ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ఈ ఇరుకైన వీధి పర్యాటకప్రాంతంగా మారిపోయింది. ఈ స్ట్రీట్ జర్మనీలోని రియూల్టిన్‌జెన్ పట్టణంలో ఉంది. ఈ ఇరుకైన వీధికి స్ప్రోయూర్‌హోఫ్ స్ట్రాసే అనే పేరు ఉంది. జర్మనీ వెళ్లిన పర్యాటకులు తప్పనిసరిగా ఈ వీధిని సందర్శిస్తుంటారు.