నేడు రెండో రోజు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ రోజు ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించనున్నారు. అనంతరం పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నిన్న తిరుపతి చేరుకున్న శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్సే నేడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు. సాయంత్రం తిరిగి శ్రీలంకకు వెళ్లనున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జనవరి నెల టికెట్లను…