జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం నేడు ప్రారంభం కానుంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా తణుకులో నిర్వహిస్తున్న బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. సభలోనే లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందించనున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. నేడు ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించనున్న కార్యక్రమానికి ఆయన మహిళ ఉద్యోగులతో కలిసి పాల్గొననున్నారు.
ఢాకాలో నేడు హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ జరుగనుంది. సెమీస్‌లో జపాన్‌తో భారత్ తలపడనుంది.
బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేడు భేటీ కానుంది. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీ చర్చించనున్నారు.
ఢిల్లీలోని పార్లమెంట్ గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకు నేడు విపక్షాలు ర్యాలీ నిర్వహించనున్నాయి. లఖింపూర్ ఘటనపై మంత్రి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేయనున్నాయి.
నేడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలో ఎల్బీనగర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ హజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అటువైపు వెళ్తున్న ట్రాఫిక్‌పై పోలీసులు ఆంక్షలు విధించారు.
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో చర్చలు జరిపేందుకు వెళ్లిన తెలంగాణ మంత్రులు నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను మధ్యాహ్నం 2.30 గంటలకు కలువనున్నారు.
తెలంగాణ బీజేపీ నేతలు నేడు కేంద్ర మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయ పరిస్థితులు, సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై అమిత్‌షాకు వివరించనున్నారు.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,850లు ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,700లుగా ఉంది. అయితే కిలో వెండి ధర రూ. 65,960లుగా ఉంది.