నేడు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు స్టార్టప్‌లతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఆరు అంశాలపై స్టార్టప్ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
అండర్-19 ప్రపంచకప్‌లో నేడు సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది. జార్జ్‌టౌన్ వేదికగా సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
నేడు తొలిసారి భారత సైన్యం కొత్తయూనిఫాంను ప్రదర్శించనున్నారు. భారత సైన్యం త్వరలో కొత్త వస్త్రాలతో పోరులోకి దిగనుంది. జవాన్లకు మరింత సౌకర్యం కల్పించేలా, శతృవులను మెరుగ్గా ఏమార్చేలా కేంద్ర ఈ యూనిఫాంను తయారుచేయించింది.
నేడు భారీ జాతీయ పతాక ప్రదర్శన. సైనిక దినోత్సవం సందర్భంగా భారత్-పాక్ సరిహద్దులోని లోంగేవాలలో భారీ జాతీయ పతాక ప్రదర్శన నిర్వహించనున్నారు.
నేటి నుంచి తిరుమలలో సుప్రభాత సేవ పునఃప్రారంభం కానుంది. ధనుర్మాసం ముగియడంతో సుప్రభాత సేవను పునఃప్రారంభిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,100లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,000లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 65,900లుగా ఉంది.