నేడు భారత్-చైనా 14వ రౌండ్ కమాండర్ స్థాయి చర్చలు జరుగనున్నాయి. చుషుల్-మాల్దో ప్రాంతంలో ఉదయం 9.30 గంటలకు సమావేశం జరుగనుంది. ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలంలోని రామాలయంలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. కరోనా కారణంగా ఆలయంలోనే కొలను ఏర్పాటు చేసి తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అంతేకాకుండా తెప్పోత్సవం కార్యక్రమానికి భక్తులకు అనుమతి నిరాకరించారు. నేడు గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ విద్యానగర్‌లో ఐటీసీకి చెందిన వెల్కమ్ హోటల్‌ను ప్రారంభించనున్నారు.…