తిరుమలలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లను టీటీడీ సర్వం సిద్ధం చేస్తున్నది. రేపటి నుంచి ఈనెల 15 వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఈరోజు సాయంత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగబోతున్నది. ఇక రేపు సాయంత్రం 5:10 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. రేపు రాత్రి పెద్ద శేష వాహన సేవతో వాహన సేవలు ప్రారంభం కాబోతున్నాయి. 9 రోజులపాటు వివిధ వాహనాలపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ఈనెల 15 వ తేదీన చక్రస్నానంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. అయితే, కరోనా దృష్ట్రా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్టు టీటీడీ తెలియజేసింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలను టీటీడీ రద్ధు చేసింది.
Read: రష్యా సాహసం: అంతరిక్షంలో తొలిసారి సినిమా షూటింగ్…