నిత్యకల్యాణం పచ్చతోరణంగా భాసిల్లే క్షేత్రం తిరుమల. తిరుమల క్షేత్రంలో ప్రతి నిత్యం నిత్యోత్సవాలు... ప్రతివారం వారోత్సవాలు... ప్రతి మాసం మాసోత్సవాలు.. నిర్వహిస్తూనే వుంటారు. స్వామివారికి సుప్రభాతం, తోమాలసేవ, అర్చన, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఏకాంత సేవ వంటి నిత్యోత్సవాలు..... విశేష పూజ , అష్టదళపాదపద్మారాధన, సహస్రకలషాభిషేకం, తిరుప్పావడ, పూలంగి సేవ, శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు.....పుష్పయాగం, పవిత్రోత్సవం, ఆణివార ఆస్థానం, వసంతోత్సవం, జేష్ఠాభిషేకం, పార్వేటి ఉత్సవం, ప్రణయ కలహమహోత్సవం, పద్మావతి పరిణయోత్సవం వంటి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది టిటిడి. ఏడాది…
శ్రీశైలం మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల దేవాలయాలను, మండపాలను విద్యుద్దీపాలతో శోభాయమానంగా ఆలయ అధికారులు ముస్తాబు చేశారు. ఈరోజు (ఫిబ్రవరి 19) నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మార్చి 1వ తేదీ వరకు జరగనున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఫిబ్రవరి 23న సీఎం చంద్రబాబు నాయుడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఉత్సవాల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. పలువురు…
Yadadri : నేటి నుంచి యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారుజాము నుంచే లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి క్యూ కట్టారు.
నాగర్‌కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం పెద్దపల్లి గ్రామంలోని శ్రీ స్వయంభు బుగ్గ పెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. శనివారం రాత్రి నిర్వహించిన రథోత్సవంలో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు.