ప్రముఖులు RBVRR హాస్టల్లో ఉన్నవారే అన్నారు మంత్రి హరీశ్ రావు. రాజ్ బహుదూర్ వెంకట్రామ్ రెడ్డి స్థాపించిన ఎడ్యుకేషనల్ సొసైటీ విస్తరణలో భాగంగా ఈరోజు కొత్త భవనానికి భూమి పూజ చేసుకోవడం సంతోషం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసు పంపిణీ వేగం పెంచాలని అధికారులకు మంత్రి హరీశ్ రావ్ ఆదేశించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో DMHOలతో మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని వైద్య సిబ్బందికి పలు సచనలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మళ్ళీ దేశంలో వేగం పుంజుకుంటోందని ,పోర్త్ వేవ్ కు చేరువలో వున్నామా అన్నట్లు భయాన్ని…
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు బహిరంగ లేఖ రాశారు. నిమ్స్ లో కాంట్రాక్టు స్టాఫ్ నర్సు ల సమస్యలు పరిష్కరించాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు. 423 మంది స్టాఫ్ నర్సులు పది రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు.. ఇది దుర్మార్గమని ఆయన తెలంగాణ ప్రభుత్వంపై అగ్రహం వ్యక్తం చేశారు. ప్రసూతి సెలవులు నుంచి జీతాల పే స్లిప్ ల వరకు…
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని టీఎస్ పార్డ్‌లో 33 జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, ఉద్యోగులతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి నెలా ఒకరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్.. దేశంలో తొలిస్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. 100శాతం వ్యాక్సినేషన్ దిశగా కృషి చేయాలని అధికారులను అదేశించారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో…
రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు తెలుసుకునే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా ములుగులో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన యూనివర్సిటీలో గిరిజనులకు ఏడున్నర శాతం సీట్లు మాత్రమే కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు, 90 శాతం సీట్లు…
హైదారాబాద్ కార్పోరేట్ ఆసుపత్రులలో ఎలాంటి వైద్య సేవలు, సౌకర్యాలు ఉన్నాయో అవే ఆదిలాబాద్ లో అందుబాటులో కి తెచ్చామని మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. గత పరిస్థితులు మారాయని, ఇప్పుడు వైద్యులు అన్ని చోట్లకు వస్తున్నారని ఆయన అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం అందించేందుకు ప్రత్యేక దృష్టిసారించామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా దేశంలోనే వైద్యం అందించడంలో తెలంగాణ నంబర్ వన్ స్థానం సాధించడం కోసం…
బేగంపేట్ లోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)లో విద్యార్థినుల వసతి గృహానికి ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్రమైన ఆర్థిక, సామాజిక అధ్యయనం ఉన్నప్పుడే ఏ రాష్ట్రం అయినా, దేశం అయినా పురోగతి చెందుతుందని ఆయన అన్నారు. ఆ ఫలితాల ఆధారంగా మంచి పరిపాలన అందించడం సాధ్యం అవుతుందని, రాబోయే రోజుల్లో బడ్జెట్ అంశాలకు సంబంధించి సెస్ తో మరింతగా కలిసి…
ఫీవర్ సర్వేతో రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా తగ్గినట్టు వెల్లడించారు.. మహీంద్ర కంపెనీ ఆధ్వర్యంలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడాన్ని అభినందించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అన్నారు.. కరోనా సెకండ్ వేవ్ లో 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం పడింది. కానీ, 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే…
ఉస్మానియా ఆస్పత్రిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.7కోట్లతో క్యాథ్‌ల్యాబ్, సిటీ స్కాన్ లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా మరో నాలు క్యాథ్ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసువస్తామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్య అందేలా ఏర్పాటు చేస్తున్నామని, ఉస్మానియా అస్పత్రిలో రూ.5 కోట్లతో అధునాతన మార్చురీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాత్రి పూట పోస్టుమార్టం చేసేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నామని ఆయన అన్నారు.…
కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో ప్రజలపై మరోసారి విరుచుకుపడుతోంది. ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ రోజుకో రాష్ట్రంలో వెలుగు చూస్తోంది. ఇటీవల తెలంగాణాకు పక్కనే ఉన్న ఏపీలోనూ రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఒమిక్రాన్‌పై అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం ఆరోగ్యశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనే ప్రణాళికలపై…