ఆఫ్ఘనిస్తాన్‌లోని అన్ని ప్రాంతాలను తాలిబన్లు వశం చేసుకున్నా, పంజ్‌షీర్ మాత్రం తాలిబన్లకు దక్కకుండా ఉండిపోయింది. ఎలాగైనా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని తాలిబన్లు ప్రయత్నం చేస్తున్నారు. కానీ, తాలిబన్లకు మాత్రం ఆ అవకాశం ఇవ్వడం లేదు పంజ్‌షీర్ దళాలు. తాలిబన్లు దాడులు చేసిన ప్రతిసారి పంజ్‌షీర్ సైన్యం ఎదురుదాడి చేసి తాలిబన్లను మట్టుబెడుతున్నది. పెద్దసంఖ్యలో తాలిబన్లు పంజ్‌షీర్ చేతిలో హతం అయ్యారు. ఇక ఇదిలా ఉంటే, పంజ్‌షీర్ దళాలపై పోరాటం చేసుందుకు అల్‌ఖైదా సాయం తీసుకున్నారు తాలిబన్లు. అల్‌ఖైదా సాయంతో పంజ్‌షీర్‌ను ఆక్రమించుకుంటామని తాలిబన్లు చెబుతున్నారు. అయితే, పంజ్‌షీర్ దళం మాత్రం తాలిబన్లకు లొంగేది లేదని ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్ల చెర నుంచి విడిపిస్తామని, తిరిగి ప్రజాస్వామ్యాన్ని తీసుకొస్తామని పంజ్‌షీర్ దళం చెబుతున్నది.