వ్యాక్సిన్ తీసుకున్న వారికే అక్క‌డ మ‌ద్యం…

క‌రోనా మ‌హమ్మారికి చెక్ పెట్టాలి అంటే త‌ప్ప‌ని స‌రిగా వ్యాక్సిన్ తీసుకోవ‌డం ఒక్క‌టే ప్ర‌స్తుతానికి ఉన్న మార్గం.  దీంతో అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాలు విజ్ఞ‌ప్తి చేస్తున్నాయి.  అంతేకాదు, క‌రోనా నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటే, త‌మిళ‌నాడులోని నీల‌గిరి అధికారులు వినూత్న‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు.  త‌మిళ‌నాడులో ప్ర‌భుత్వ‌మే మ‌ద్యం దుకాణాల‌ను నిర్వ‌హిస్తుంది.  నీల‌గిరిలోని మ‌ద్యం దుకాణాల్లో మ‌ద్యం కొనుగోలు చేయాలంటే త‌ప్ప‌ని స‌రిగా ఆధార్ కార్డుతో పాటుగా, రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న‌ట్టుగా ధృవీక‌ర‌ణ ప‌త్రం ఉండాల‌ని, అలా ఉన్న‌వారికే మ‌ద్యం విక్ర‌యిస్తామ‌ని అధికారులు చెబుతున్నారు.  మొద‌టిసారిగా ఈ విధానాన్ని నీల‌గిరిలో అమ‌లు చేస్తున్నారు. ఇక నీల‌గిరి జిల్లాలో మొత్తం 76 మ‌ద్యం దుకాణాలున్నాయి.  కోటి రూపాయ‌ల మేర మ‌ద్యం అమ్మాకాలు జ‌రుగుతుంటాయి.  ఇక ఈ జిల్లాలో 70 శాతం మంది టీకాలు తీసుకున్న‌ట్టు అధికారులు చెబుతున్నారు.  

Read: అసెంబ్లీ నుంచి ఎర్రకోట వరకు… సీక్రెట్ పాస్‌…

Related Articles

Latest Articles

-Advertisement-