Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Top Story Salur Rajeshwar Rao Birth Anniversary Today

ర’సాలూరి’స్తూనే ఉన్న రాజేశ్వరరావు స్వరకల్పన!

Published Date :October 11, 2021 , 5:52 am
By Manohar
ర’సాలూరి’స్తూనే ఉన్న రాజేశ్వరరావు స్వరకల్పన!
  • Follow Us :

సాలూరు రాజేశ్వరరావు ఆ రోజుల్లో బాలమేధావి అనే చెప్పాలి. పట్టుమని ఐదేళ్ళు కూడా నిండని వయసులోనే హార్మోనియం మెట్లపై పాటలకు బాణీలు కట్టేవారు. తబలా, మృదంగం కూడా లయబద్ధంగా వాయించేవారు. చిత్రసీమలో సాలూరి వారి బాణీలు మధురామృతం పంచాయి. మూకీ సినిమాల నాడు సైతం సాలూరి వారి స్వరకల్పన సాగింది. టాకీలలో మరపురాని ‘మల్లీశ్వరి’ని మన ముందు ఉంచారు. ‘చంద్రలేఖ’ డ్రమ్స్ మ్యూజిక్ తో యావత్ భారతాన్నీ మురిపించారు. ‘విప్రనారాయణ’ పాటల సవ్వడి ఈ నాటికీ యెదలను మీటేలా చేశారు. ఏది చేసినా అన్నిటా సాలూరు రాజేశ్వరరావు మార్కు వినిపిస్తుంది. అదే ఈ నాటికీ తెలుగువారిని పులకింప చేస్తోంది.

విజయనగరం జిల్లాలోని సాలూరు సమీపంలో శివరామపురం సాలూరు రాజేశ్వరరావు జన్మస్థలం. 1922 అక్టోబర్ 10న రాజేశ్వరరావు జన్మించారు. చిన్నతనంలోనే అన్న హనుమంతరావుతో కలసి తండ్రి సన్యాసి రాజు వద్ద సంగీతాభ్యాసం చేసేవారు. నాలుగేళ్ళ ప్రాయంలోనే కర్ణాటక సంగీతంలోని రాగాలను ఇట్టే పట్టేసేవారు రాజేశ్వరరావు. తండ్రి వద్దనే హార్మోనియం, తబలా నేర్చుకున్నారు. తండ్రి సన్యాసి రాజు ఆ రోజుల్లో విడుదలయ్యే మూకీ సినిమాలకు తెరచెంతనే కూర్చుని హార్మోనియం వాయించేవారు. చిన్నారి రాజేశ్వరరావు సైతం ఆయన విశ్రాంతి తీసుకొనే సమయంలో హార్మోనియం వాయించి అందరినీ అలరించేవారు. ఆయన ప్రతిభ తెలిసిన గ్రామఫోన్ రికార్డింగ్ కంపెనీలు రాజేశ్వరరావుతో పాటలు పాడించాయి. అలా తెలుగువారినందరినీ రాజేశ్వరరావు గానం సైతం ఆకట్టుకుంది. రాజేశ్వరుని ప్రతిభ తెలిసిన వేల్ పిక్చర్స్ అధినేత 1935లో రూపొందించిన ‘శ్రీకృష్ణలీలలు’లో ఆయనతో కృష్ణుని వేషం వేయించారు. అలా చిత్రసీమలో తొలి అడుగు వేసిన రాజేశ్వరరావు ఆపై ‘శశిరేఖా పరిణయం’లో అభిమన్యునిగా నటించి, పాటలతోనూ ఆకట్టుకున్నారు. తరువాత కలకత్తా చేరి అక్కడ ఓ చిత్రంలో నటించే సమయంలో నాటి మేటి గాయకులు కె.ఎల్.సైగల్ వద్ద శిష్యరికం చేశారు. అదే రాజేశ్వరరావు జీవితాన్ని మేలిమలుపు తిప్పింది. అక్కడ ఎందరో పేరొందిన సంగీత దర్శకుల వద్ద హిందుస్థానీ రాగాలనూ ఇట్టే నేర్చుకున్నారు. మద్రాసు చేరాక ‘విష్ణులీల’ అనే చిత్రానికి సహాయ సంగీత దర్శకునిగా పనిచేశారు. ‘జయప్రద’ చిత్రంతో సోలో సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు రాజేశ్వరరావు.

జెమినీ వారి ‘బాలనాగమ్మ’ చిత్రానికి ఎమ్.డి పార్థసారథి సంగీత దర్శకులు కాగా, నేపథ్య సంగీతం బాధ్యత సాలూరు రాజేశ్వరరావుకు అప్పగించారు. అందులో నేపథ్య సంగీతం ఆ రోజుల్లో అందరినీ ఆకట్టుకుంది. మరో విశేషమేమంటే, జెమినీ వారి ‘బాలనాగమ్మ’కు పోటీగా వసుంధర సంస్థ ‘శాంత బాలనాగమ్మ’ నిర్మించింది. అందులో బాలవర్ధి రాజు పాత్రలో సాలూరు రాజేశ్వరరావు నటించి, పాటలు పాడారు. అంతేకాదు ఆ చిత్రానికి సంగీతం సమకూర్చారు. జెమినీ వారి బాలనాగమ్మ భారీతనంతో ఆకట్టుకుని విజయం సాధించింది. అయినా శాంత బాలనాగమ్మ పాటలు జనాన్ని రంజింప చేయడం విశేషం. జెమినీ అధినేత వాసన్ కు రాజేశ్వరరావుపై గురి కుదిరింది. దాంతో 1948లో తాను తమిళ,తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన ‘చంద్రలేఖ’కు సాలూరు రాజేశ్వరరావునే సంగీత దర్శకునిగా ఎంచుకున్నారు. అందులో డ్రమ్స్ నేపథ్యంలో రూపొందిన పాటలో సాలూరు ప్రయోగించిన బాణీలు జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.

సాలూరు రాజేశ్వరరావు జీవితంలో అన్నిటికన్నా మిన్నగా మేలిమి రత్నంగా వెలుగొందిన చిత్రం వాహినీ వారి ‘మల్లీశ్వరి’. బి.యన్.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘మల్లీశ్వరి’లోని అన్ని పాటలనూ మనసులను ఆకట్టుకొనేలా స్వరపరిచారు రాజేశ్వరరావు. ఈ చిత్రం ద్వారా దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి చిత్రసీమలో ప్రవేశించారు. నటీనటులుగా భానుమతి, యన్టీఆర్ కు సైతం ‘మల్లీశ్వరి’ ఎంతో పేరు సంపాదించి పెట్టింది. ఇక సాలూరు రాజేశ్వరరావు పేరు వినగానే ‘మల్లీశ్వరి’ గుర్తుకు వస్తుంది. ఆ సినిమాను తలచుకోగానే ఆయన బాణీలే మనసున మెదలుతాయి. రాజేశ్వరరావు అంతకు ముందు, ఆ తరువాత ఎన్ని మధురామృతాలు అందించినా, ‘మల్లీశ్వరి’ అన్నిటిలోకి అతిమధురం అని చెప్పవచ్చు.

‘మల్లీశ్వరి’ తరువాత రాజేశ్వరరావుకు మంచి పేరు సంపాదించి పెట్టిన చిత్రం ‘విప్రనారాయణ’. ఇందులోని పాటలన్నీ అలరించాయి. “ఎందుకోయి తోటమాలీ…అంతులేని యాతన…” పాటను కీరవాణి రాగంలో స్వరపరిచారు. ఈ పాటను విని ఆయనను ఎంతగానో అభిమానించిన శివశక్తిదత్త అదే పనిగా సాలూరు రాజేశ్వరరావును చూడటానికి మద్రాసు వెళ్ళారు. ఆ పాట రాగం పేరు తెలుసుకొని, తన తొలి సంతానానికి ఆ పేరే పెట్టాలని నిర్ణయించారు. అలాగే ఆయన తనకు కొడుకు పుట్టగా ఆయనకు కీరవాణి అని నామకరణం చేశారు. ఆ కీరవాణి ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో మేటి సంగీత దర్శకునిగా సాగుతున్నారు. అలా అభిమానులను ఎంతగానో తన స్వరకల్పనతో ఆకట్టుకున్నారు రాజేశ్వరరావు.

తన సంగీతంతో అలరించడమే కాదు, వ్యక్తిత్వంలోనూ రాజేశ్వరరావుది ప్రత్యేకమైన బాణీ. తనకు ఎవరైనా మనసుకు కష్టం కలిగిస్తే, వారిచ్చే పారితోషికం కోసం ఎదురుచూడకుండా అక్కడిక్కడే సదరు చిత్రాలను వదిలేసిన సందర్భాలున్నాయి. అలా కేవీ రెడ్డి ‘మాయాబజార్’కు స్వరకల్పన చేస్తూ తనకు నచ్చని అంశాలు చోటు చేసుకోవడంతో ఆ సినిమా వదలుకున్నారు. ఆయన సమకూర్చిన బాణీలను అలాగే పొందుపరచి, మిగిలిన పాటలకు తన మార్కు బాణీలు కట్టారు ఘంటసాల. ఇక పెండ్యాల నాగేశ్వరరావు తన వద్దకు వచ్చి అసిస్టెంట్ గా పనిచేస్తానంటే, వారించి, నీలోనే గొప్ప సంగీతదర్శకుడున్నాడు ప్రయత్నించు అని ప్రోత్సహించారు రాజేశ్వరరావు. ఇక పెండ్యాల నాగేశ్వరరావు సైతం తన స్వరకల్పనతో ఎంతటి మధురాన్ని తెలుగువారికి అందించారో చెప్పక్కర్లేదు. శాస్త్రీయ సంగీతంలోనే అనేకసార్లు మధురామృతం చిలికించిన సాలూరు వారి తరువాతి రోజుల్లో కాలానుగుణంగా తన స్వరకల్పనలో పాశ్చాత్య బాణీలనూ అందిపుచ్చుకొని తెలుగువారిని అలరించారు. నిర్మాతల అభిలాషపై ఉత్తరాది బాణీలను అనుసరిస్తూ స్వరకల్పన చేశారు. ఆయన సంగీతంలో పాటలు రాయాలని తపించిన కవులూ ఉన్నారు. ఆయన స్వరకల్పనలో గానం చేసి తరించాలని ఆశించిన గాయకులూ ఉన్నారు. అందరికీ తగిన గుర్తింపు లభించేలా సాలూరి వారి బాణీలు సాగాయి.

రాజేశ్వరరావు అన్న హనుమంతరావు కూడా కొన్ని చిత్రాలకు సంగీతం సమకూర్చారు. ఇక రాజేశ్వరరావు తనయుల్లో వాసూరావ్, కోటి సంగీత దర్శకులయ్యారు. వారిలో కోటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గానూ సాగారు. చివరలో సాలూరు రాజేశ్వరరావు స్వరకల్పన చేసిన “తాండ్ర పాపారాయుడు, అమెరికా అబ్బాయి, ఆదర్శవంతుడు” చిత్రాల్లోనూ కొన్ని పాటలు మధురామృతం కురిపించాయి. 1999 అక్టోబర్ 25న సాలూరు రాజేశ్వరరావు కన్నుమూశారు. ఆయన స్వరాలు మాత్రం ఈ నాటికీ రసాలూరిస్తూనే ఉండడం విశేషం!

  • Tags
  • birth anniversary
  • salur rajeshwar rao
  • salur rajeshwar rao birth anniversary

WEB STORIES

అప్పట్లో బికినీ వేసి ఇండస్ట్రీని షేక్ చేసిన సీనియర్ హీరోయిన్స్ వీరే..

"అప్పట్లో బికినీ వేసి ఇండస్ట్రీని షేక్ చేసిన సీనియర్ హీరోయిన్స్ వీరే.."

తరుచూ గ్యాస్ట్రిక్, కడుపు నొప్పితో బాధపడుతున్నారా..? అయితే

"తరుచూ గ్యాస్ట్రిక్, కడుపు నొప్పితో బాధపడుతున్నారా..? అయితే "హెచ్ పైలోరీ" ఇన్ఫెక్షన్ కావచ్చు..జాగ్రత్త.."

నల్లని పెదవులను తెల్లగా మార్చే చిట్కాలు..!

"నల్లని పెదవులను తెల్లగా మార్చే చిట్కాలు..!"

తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలు

"తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలు"

Ragi Upma: రోగాలను దూరం చేసే రాగి ఉప్మా.

"Ragi Upma: రోగాలను దూరం చేసే రాగి ఉప్మా."

బొబ్బర్లతో బోలెడు లాభాలు

"బొబ్బర్లతో బోలెడు లాభాలు"

Curry Juice: కరివేపాకు జ్యూస్‌తో ఎన్నో లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు

"Curry Juice: కరివేపాకు జ్యూస్‌తో ఎన్నో లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు"

పుణ్యక్షేత్రాల్లో రాళ్లు పేరిస్తే ఇల్లు కడతామా!

"పుణ్యక్షేత్రాల్లో రాళ్లు పేరిస్తే ఇల్లు కడతామా!"

Star Heroes: ఈ స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్స్ ఎవరో తెలుసా..?

"Star Heroes: ఈ స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్స్ ఎవరో తెలుసా..?"

Cancer Prevent Foods: క్యాన్సర్‌ని నివారించే ఫుడ్ ఐటమ్స్.. తరచూ తీసుకుంటే ఎంతో మేలు

"Cancer Prevent Foods: క్యాన్సర్‌ని నివారించే ఫుడ్ ఐటమ్స్.. తరచూ తీసుకుంటే ఎంతో మేలు"

RELATED ARTICLES

Dhakshina Murthy: సుస్వర విన్యాసాల సుసర్ల దక్షిణామూర్తి

Bandi Sanjay: తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీలుస్తోందంటే వల్లభాయి పటేల్ కారణం

KV Reddy: తెలుగు సినిమా ఠీవి.. కేవీ రెడ్డి!

11

Sirivennela Sitaramasastri Birth Anniversary Celebrations

Trivikram Srinivas: సినిమా పాట కన్నా ఎత్తైన మనిషి సిరివెన్నెల

తాజావార్తలు

  • Kakani Govardhan Reddy: వాళ్లు ద్రోహం చేశారు.. అందుకే పార్టీ వారిని సస్పెండ్ చేసింది

  • Atiq Ahmed: ప్రయాగ్‌రాజ్ జైలులోని హైసెక్యూరిటీ బ్యారక్‌కు అతిక్ అహ్మద్‌!

  • MLA Rapaka Varaprasad: టీడీపీ నాకు రూ.10 కోట్లు ఆఫర్ చేసింది.. ఎమ్మెల్యే రాపాక బాంబ్

  • Nani: అన్నా.. ఒకవేళ సినిమా పోతే ఆ డ్రెస్లు అన్ని ఏంచేస్తావే..?

  • Man Sentenced: అనుకోకుండా చిన్నారి హత్య.. దోషికి 100 ఏళ్ల జైలు శిక్ష

ట్రెండింగ్‌

  • GSLV Mark3: నింగిలోకి దూసుకెళ్ళిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం3

  • RRR Storybook : ‘RRR’ కథతో జపాన్ పుస్తకం.. సినిమా చూడటం కష్టం…

  • Girl Helicopter Shot: అమ్మాయి బ్యాటింగ్ కు కేంద్ర మంత్రి ఫిదా!

  • Joe Biden : అమెరికా అధ్యక్షుడిని వెక్కిరిస్తూ స్కిట్‌.. కమలా హారిస్‌లతో కలిసి పేరడీ

  • Illusion Biryani: ప్రత్యేకమైన ‘బిర్యానీ’ ట్రై చేయాలనుకుంటున్నారా?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions