Realme P3 Ultra 5G: రియల్‌మీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ P3 అల్ట్రా 5Gను భారత మార్కెట్‌లో నేడు (మార్చి 25)న విడుదల చేసింది. ఈ ఫోన్ లో ఆకట్టుకునే ఫీచర్లు, ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను మరింత ఆకర్షిస్తోంది. ఇకపోతే నేడు విడుదలైన ఈ రియల్‌మీ P3 అల్ట్రా 5G మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 26,999. అలాగే ఈ ఫోన్ ను బ్యాంకు ఆఫర్ ద్వారా రూ. 3,000 తగ్గింపు, అదనంగా రూ. 1,000 ఎక్స్చేంజ్ ఆఫర్, 6 నెలల నో కాస్ట్ EMI సౌకర్యం అందిస్తోంది. ఈ ఆఫర్‌లతో ఫోన్ కేవలం రూ. 22,999కే పొందవచ్చు. అలాగే 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27,999. బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 23,999కే అందుబాటులో ఉంది. అలాగే 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999. అయితే బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 25,999కే మొబైల్ ను పొందవచ్చు. ఈ ఫోన్‌ను రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, సమీపంలోని ఎలక్ట్రానిక్స్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
Read Also: FASTag: ఫాస్ట్ ట్యాగ్ వ్యవహారంపై హైకోర్టు కీలక తీర్పు.. అలాచేస్తే రెట్టింపు టోల్ చార్జీలు వసూలు
ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఇందులో 6.83-అంగుళాల డిస్‌ప్లే,1.5K కర్వ్డ్ AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, గోరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ లభించనుంది. ఈ మొబైల్ కు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 4nm ప్రాసెసర్ అందించబడుతుంది. ఇక ఈ మొబైల్ లో కెమెరా విషయానికి వస్తే ఇందులో 50MP సోనీ IMX896 ప్రధాన కెమెరా (OIS సపోర్ట్‌తో), 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. అలాగే ఇందులో 6000mAh బ్యాటరీ సామర్థ్యంతో 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించబడింది. ఇక ఈ మొబైల్ లో ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, హై-రెజ్ ఆడియో సపోర్ట్, IP66, IP68, IP69 లాంటి నీటి, దుమ్ము, ధూళి నుండి కాపాడే ఆప్షన్స్ కూడా ఉన్నాయి.