టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో ఎన్టీఆర్-ప్రణతి ఒక్కరు. ప్రణతి అందరిలా కాదు. మనకు తెలిసి మిగతా స్టార్ హీరోల వైఫ్‌లు అని రంగాల్లో ముందుంటున్నారు. కానీ ప్రణతి అలా కాదు. ఇంటికే పరిమితం అనేలా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కనిపించదు. బయటకు రావడం కూడా చాలా తక్కువ. సందర్భాలను బట్టి అటెండ్ అవుతూ ఉంటుంది. అయితే తాజాగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ జపాన్‌లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 28న జపనీస్‌లో ‘దేవర’ రిలీజ్ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఫస్ట్ రోజు ప్రీమియర్ షో సందర్భంగా ఓ అభిమానితో డ్యాన్స్ కూడా చేశాడు. రెండో రోజు సైతం అదే ఉత్సాహంతో స్టైలిష్ లుక్ లో తారక్ అక్కడి ప్లేసెస్‌లో తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తారక్ తో పాటుగా ఆయన సతీమణి ప్రణతి కూడా వెళ్ళింది.
Also Read: Bollywood : OTT లోకి ‘ఛోరీ 2’.. వెన్నులో వణుకుపుట్టిస్తున్న టీజర్
ఈ సందర్భంలో అతని భార్య పుట్టినరోజు కూడా కలిసి రావడంతో, నిన్న రాత్రి ప్రణతి పుట్టినరోజు వేడుకలు ఎన్టీఆర్ ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు NTR తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, దానికి ‘అమ్మలు పుట్టినరోజు శుభాకాంక్షలు..’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రణతి పుట్టినరోజు వేడుకలు ఇలా ఇక్కడ జరుపుకోవడం పట్ల అతని ఆనందాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు