ఈ మధ్యకాలంలో హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బ్లాక్ మ్యాజిక్ మీద వచ్చే కథల పై ప్రేక్షకులు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే OTT సంస్థలు కూడా అలాంటి కంటెంట్ ఉన్న సినిమా లు, సిరీస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ నటి నుస్రత్ భరూచా ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ ‘ఛోరీ 2’ రాబోతుంది. అతీంద్రియ శక్తులు.. సామాజిక దురాచారాల నుంచి.. తన కూతురిని కాపాడుకునేందుకు, ఓ తల్లి ఎలాంటి పోరాటం చేసింది అనే కథాంశంతో, గతంలో విడుదలైన మూవీ ‘ఛోరీ’. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సినిమాకు రిక్వెల్‌గా రాబోతున్న చిత్రం ఈ ‘ఛోరీ 2’.
Also Read: Sreelela : ‘ రాబిన్ హుడ్’ లో నా పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది..
విశాల్ ప్యూరియా తెరకెక్కించిన ఈ సినిమారు భూషణ్కుమార్ నిర్మించగా, ఇందులో సోహా అలీఖాన్, గష్మీర్ మహాజని, సౌరభ్ గోయెల్, పల్లవి అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక తాజాగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఏప్రిల్ 11 నుంచి ప్రసారం కానుంది. దీంతో సామాజిక మాధ్యమాల వేదికగా టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. మొదటి భాగం కంటే కూడా ఎంతో భయంకరంగా ఉంది. ‘మరోసారి అదే స్థలం, అదే ప్రమాదం, అదే భయం’ అనే మాటలతో మొదలై ‘నీ కూతురు ఇప్పుడు నాది.. ఎప్పటికీ నాదే!..’ అనే సంభాషణలతో సాగుతున్న ఈ టీజర్ సినీ ప్రియుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఇందులో దుష్ట శక్తుల నుంచి తన కూతురిని కాపాడుకునే తల్లి పాత్రలో మరోసారి కనిపించనుంది నుస్రత్. మరిక టీజరే ఇలా ఉంటే మొత్తం మూవీ ఎలా ఉంటుందో.