కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతున్నది. కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా కేసులు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూరోపియన్ దేశాల్లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. కరోనా నుంచి రక్షణ పొందాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకుంటే ఒమిక్రాన్ నుంచి కొంతమేర రక్షణ పొందవచ్చు. ఆసుపత్రుల్లో చేరే అవకాశం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నా చాలా మంది నిర్లక్ష్యం వహించి వ్యాక్సిన్ తీసుకోవడం లేదు. దీంతో కేసులు భారీగా పెరుగుతున్నాయి.
Read: ఏపీ పాలనా రాజధానిపై మంత్రి కీలక వ్యాఖ్యలు
బ్రిటన్‌లో రికార్డ్ స్తాయిలో 78 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి అంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు, ఫ్రాన్స్‌లో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. ఆసుపత్రుల్లో చేరుతున్నవారిలో అత్యధికశాతం వ్యాక్సిన్ తీసుకోనివారే ఉండటంతో వైద్యులు వైద్యం చేసేందుకు చాలా కష్టపడాల్సి వస్తున్నది. ఆసుపత్రిలో చేరుతున్న 13 మందిలో 11 మంది వ్యాక్సిన్ తీసుకోని వారే ఉన్నారని ఫ్రాన్స్ తెలియజేసింది.