లాస్ ఏంజిల్స్ లో శనివారం నుంచి అధికారులు ఇప్పటి వరకు సుమారు 400 మందిని అరెస్టు చేశారు. వీరిలో 330 మంది వలసదారులు ఉండగా, మరో 157 మందిని వారికి మద్దతు తెలిపినందుకు అదుపులోకి తీసుకున్నారు.
కాంగ్రెస్ ఎక్కడుంటే మత కల్లోలాలు, కర్ఫ్యూలు, కరప్షన్ ఉంటుంది అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. స్వాత్యంత్రం వచ్చాక ఒక బీసీ నాయకుడు ప్రధాని అయ్యాడు.. దేశంలో అద్భుతమైన రహదారులు వేశాం.
మహారాష్ట్రలో మరోసారి రిజర్వేషన్ కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. అంబాద్ తాలూకాలోని తీర్థపురి పట్టణంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ దగ్గర మరాఠా నిరసనకారులు రాష్ట్ర రవాణా బస్సును తగులబెట్టినట్లు ఓ అధికారి వెల్లడించారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నైనిటాల్ జిల్లాలోని బన్‌భూల్‌పురా పట్టణంలో 'అక్రమ' మదర్సా కూల్చివేతపై హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో విధించిన కర్ఫ్యూ తాత్కాలిక సడలించింది.
ఫ్రాన్స్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మరణించిన అనంతరం తలెత్తిన అల్లర్లు కొనసాగుతున్నాయి. ఘటన జరిగిన మంగళవారం నాటి రాత్రి పారిస్ శివారు ప్రాంతాల్లోనే చోటుచేసుకున్న ఈ అల్లర్లు గురువారం దేశమంతా పాకాయి.
Manipur: మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. ఈసారి రాజధాని ఇంఫాల్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆర్మీ, పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి.
Elephant Kills 16 People In 12 Days: జార్ఖండ్ రాష్ట్రంలో ఓ ఏనుగు విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఏకంగా 12 రోజల్లో 16 మందిని చంపేసింది. మంగళవారం ఒక్క రాంచీ జిల్లాలోని నలుగురిని చంపేసింది. దీంతో ఇట్కీ బ్లాకులో అధికారులు 144 సెక్షన్ విధించారు. ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుమిగూడకూదని హెచ్చరించారు. ఇట్కీ బ్లాకులో గ్రామస్తులు సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో తమ ఇళ్లలోనే ఉండాలని కోరారు. ఏ ఏనుగు దగ్గరికి వెళ్లవద్దని డివిజనల్ అటవీ…
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. గొటబాయ రాజపక్స ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని కొలంబోలోని అధ్యక్ష కార్యాలయం ముందు భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడి నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మంగళవారం హింసాత్మకంగా మారాయి. శ్రీలంక నైరుతి ప్రాంతమైన రాంబుక్కనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంధన ధరలు పెరగడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి…
తీవ్ర సంక్షోభంలో వున్న శ్రీలంకలో జనం నానా అవస్థలు పడుతున్నారు. ఆర్థిక సంక్షోభం అత్యంత తీవ్రరూపు దాల్చింది. ధరలు ఆకాశాన్నంటుతుండడం, నిత్యావసరాల కొరత, ద్రవ్యోల్బణం వంటి అంశాలతో లంకేయులు అల్లాడిపోతున్నారు. దీంతో దేశంలో అరాచక పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీలంక ప్రభుత్వం 36 గంటల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. దీనికి తోడు సోషల్ మీడియాపై ఆంక్షలు విధించింది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల అస్థిరత రాజ్యమేలుతుండడంతో ఈ కర్ఫ్యూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం…