కొంతమందికి కొన్నిసార్లు అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. రోజువారి కార్యక్రమాలు చేసే సమయంలో వారికి తెలియకుండానే లక్ష్మీదేవి వారి తలుపు తడుతుంది. ఓ వృద్ధ దంపతులకు నిత్యం పార్క్‌ల్లో వాకింగ్ చేయడం ఓ అలవాటుగా మారింది. ఓ రోజు ఈ దంపతులు ఆర్కాన్సాస్‌లోని క్రేటర్ డైమండ్ పార్క్‌కి వెళ్లారు. అక్కడ నోరిన్ రెడ్‌బర్గ్ ఆమె భర్త మైకెల్ లు వాకింగ్ చేస్తుండగా వారికి ఎదురుగా పసుపుపచ్చ రంగులో ఉన్న ఓ చిన్న రాయి కనిపించింది. మొదట ఆ రాయిని చూసి రంగురాయి అనుకున్నారు. అయితే, చిన్న అనుమానంతో ఆ రాయిని తీసుకొని వెళ్లి పార్క్ మేనేజ్‌మెంట్‌కు చూపించారు. ఆ రాయిని చూసిన సిబ్బంది అది పసుపురంగు డైమండ్‌గా గుర్తించారు. పార్క్‌లో అనుమతి వాకింగ్ చేసేందుకు అనుమతి ఉన్న ప్రాంతంలో వజ్రాలు దొరికితే అవి దొరికిన వారికి ఇచ్చేస్తారు. వృద్ధ దంపతులకు దొరికిన 4.38 క్యారెట్ల వజ్రం వారికే ఇచ్చేశారు. ఈ వజ్రం ఖరీదు సుమారుగా 11 లక్షల నుంచి 65 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అనుకోకుండా వాకింగ్ సమయంలో వజ్రం రూపంలో అదృష్టం కలిసి రావడంతో ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read: జమ్మూకాశ్మీర్‌లో దారుణం: ఇద్దరు టీచర్లను కాల్చిచంపిన ఉగ్రవాదులు