ప్రభుత్వ స్థలాలు, చెరువులు,నాళాలు, బఫర్ జోన్ లోని స్థలాలు కబ్జాల బారి నుంచి కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రా చర్యలతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటే నగర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హైడ్రా స్పందించిన తీరుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదు చేసిన 3 గంటల్లోనే హైడ్రా పరిష్కారం చూపింది. కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలోని జీడిమెట్ల గ్రామం సర్వే నెంబర్ 218, 214లో ఉన్న రుక్మిణి ఎస్టేట్స్ కు చెందిన పార్కును కాపాడింది.…
మహిళలపై లైంగిక వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా భయపడకుండా.. వారు చేసే పని వారు చేస్తూనే ఉన్నారు కామాంధులు. తాజాగా.. కేరళలోని కన్నూర్‌లో ఓ మహిళపై లైంగిక వేధింపుల ఉదంతం వెలుగులోకి వచ్చింది. కాగా.. ఈ కేసులో పోలీసులు చర్యలు తీసుకుని కేరళ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో.. నిందితుడు ఇఫ్తికార్ అహ్మద్‌ను విస్మయ ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్లో…
కొంతమందికి కొన్నిసార్లు అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. రోజువారి కార్యక్రమాలు చేసే సమయంలో వారికి తెలియకుండానే లక్ష్మీదేవి వారి తలుపు తడుతుంది. ఓ వృద్ధ దంపతులకు నిత్యం పార్క్‌ల్లో వాకింగ్ చేయడం ఓ అలవాటుగా మారింది. ఓ రోజు ఈ దంపతులు ఆర్కాన్సాస్‌లోని క్రేటర్ డైమండ్ పార్క్‌కి వెళ్లారు. అక్కడ నోరిన్ రెడ్‌బర్గ్ ఆమె భర్త మైకెల్ లు వాకింగ్ చేస్తుండగా వారికి ఎదురుగా పసుపుపచ్చ రంగులో ఉన్న ఓ చిన్న రాయి కనిపించింది. మొదట ఆ…