పూరైన నామినేష‌న్ల ప‌రిశీల‌న‌… బ‌రిలో ఎంత‌మంది అంటే…

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉప ఎన్నిక‌లకు సంబంధించి నామినేష‌న్ల ప‌రిశీల‌న పూర్తైంది.  క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ ఉప ఎన్నిక కోసం మొత్తం 27 నామినేష‌న్లు దాఖ‌ల‌వ్వ‌గా అందులో 9 నామినేష‌న్ల‌ను తిర‌స్క‌రించారు.  దీంతో బ‌ద్వేల్‌లో 18 మంది బ‌రిలో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే, ఇటు క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం 61 నామినేష‌న్లు దాఖ‌ల‌వ్వ‌గా, ఇందులో 19 నామినేష‌న్ల‌ను అధికారులు తిర‌స్క‌రించారు.  దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక బ‌రిలో 42 మంది అభ్య‌ర్థులు నిలిచారు.  ఈట‌ల పేరుతో ఉన్న ముగ్గురి నామినేష‌న్ల‌ను అధికారులు తిర‌స్క‌రించారు.  అయితే, ఈనెల 13 వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల ఉప సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉండ‌టంతో మ‌రికొంత మంది నామినేష‌న్ల‌ను ఉప సంహ‌రించుకునే అవ‌కాశం ఉన్న‌ది.  

Read: ఏపీ సీఎంకు నారా లోకేష్ లేఖ‌…ఇవే కీల‌క అంశాలు…

-Advertisement-పూరైన నామినేష‌న్ల ప‌రిశీల‌న‌... బ‌రిలో ఎంత‌మంది అంటే...

Related Articles

Latest Articles