ముంబైలో కరోనా నిబంధనలను మరింత కఠినం చేశారు. రోజు రోజుకు కరోనా, ఒమిక్రాన్ కేసులు భారీ స్థాయిలో పెరిగిపోతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నైట్ కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని ముంబై బీజ్‌లో అనుమతులను నిరాకరించారు.
Read: తెలంగాణలో రికార్డ్ స్థాయిలో లిక్కర్ సేల్…
సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బీచ్‌లో సందర్శకులను అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నిబంధనలు డిసెంబర్ 31 నుంచి జనవరి 15 వ తేదీ వరకు అమలులో ఉంటాయని ప్రభుత్వం తెలియజేసింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం, పోలీసులు స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఒక్కరోజులో 198 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. దేశంలో థర్డ్ వేవ్ మొదలైందనే వార్తలు రావడంతో అధికారులు దానికి తగినవిధంగా చర్యలు తీసుకుంటున్నారు.