స్మగ్లర్లు తెలివిమీరిపోతున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్ళుగప్పి విదేశాలనుంచి యథేచ్ఛగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా రాజస్థాన్లో ఓ ప్రయాణికుడు కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. జైపూర్ ఎయిర్ పోర్ట్ కు షార్జా నుంచి ఒక ప్రయాణికుడు వచ్చాడు. అతని వాలకం గమనించిన కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది.
కస్టమ్స్ తనిఖీల్లో 24 లక్షల విలువైన బంగారు బిస్కెట్లు దొరికాయి. ట్రిమ్మర్ లో బంగారు బిస్కెట్లు దాచి షార్జా నుంచి తెచ్చాడా ప్రయాణికుడు. తనిఖీల్లో బంగారం బిస్కెట్లు కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాయి. దీంతో షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడిని అరెస్ట్ చేసి బంగారం సీజ్ చేశారు. కేసుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.