Delhi Airport: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి పెద్ద ఎత్తున అక్రమ రవాణాను గుర్తించి స్మగ్లర్ల కుట్రను భగ్నం చేశారు. ఈ ఘటనలో మొత్తం 27 కోట్ల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణా వ్యవహారంలో థాయ్‌లాండ్‌కు చెందిన ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. స్మగ్లర్లు విదేశీ గంజాయిని చాకచక్యంగా 54 ప్యాకెట్లుగా ప్యాకింగ్ చేసి లగేజ్ బ్యాగ్‌లలో దాచిపెట్టారు. బట్టల తరలింపుగా చూపిస్తూ.. నాలుగు ట్రాలీ బ్యాగ్‌లను పూర్తిగా…
Drugs Seized: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్, గంజాయి, బంగారాన్ని పట్టుకున్నారు ఎయిర్ పోర్ట్ అధికారులు. ఇందులో భాగంగా 14.2 కోట్ల విలువ చేసే కోకైన్, 76 లక్షల విలువ చేసే విదేశీ గంజాయి, 1.75 కోట్ల విలువ చేసే 1.78 కేజీల బంగారం సీజ్ చేసారు కస్టమ్స్ అధికారులు. అధికారులు పట్టుకున్న కొకైన్ ను క్యాప్సూల్స్ లో నింపి పొట్టలో దాచింది లేడి కిలాడి. అదికూడా ఏకంగా 76 క్యాప్సూల్స్ మింగింది కెన్యా జాతీయురాలు.…
ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున చెన్నై పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఓ ముఠా కంటైనర్‌లో అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న దాదాపు 110 కోట్ల రూపాయల విలువైన నిషేధిత డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టాంజానియాకు చెందిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తీసుకెళ్తున్నాడనే అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఆ వ్యక్తిని అధికారులు విచారించగా.. కొకైన్ క్యాప్సూల్స్ మింగినట్లు బయటపడింది. దీంతో.. అతనికి వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడు. క్యాప్సూల్స్‌లో నింపిన మందు విలువను లెక్కించగా.. కోట్ల రూపాయల్లో ఉంది.
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. సుమారు 3353 గ్రాముల బంగారాన్ని సీజ్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. సీజ్ చేసిన బంగారం విలువ రూ.1.92 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. విదేశీ ప్రయాణీకులు బంగారాన్ని పేస్టుగా మార్చి లగేజ్ బ్యాగ్ లో దాచి పట్టుకొస్తుండగా తనిఖీలు చేపట్టడంతో బట్టబయలైంది. దుబాయ్ నుండి తీసుకొచ్చిన బంగారాన్ని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వాష్ రూమ్ వద్ద మరో వ్యక్తికి అప్పగిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
పట్టుకోలేరు అనే ధీమాతో బంగారం అక్రమ రవాణాకు పాలపడుతున్నారు. చివరికి అధికారులకి చిక్కి జైలుకి వెళ్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.
Shamshabad Airport: ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా చేస్తూ పలువురు పట్టుబడ్డారు. బంగారం స్మగ్లింగ్‌లో వారి చావుతెలివి తేటలు చూసి అధికారులు సైతం షాక్‌కు గురవుతున్నారు.
వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలోని టాయిలెట్ నుండి కోటి రూపాయలకు పైగా విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అనంతరం అధికారులు విచారణ చేపట్టారు. కస్టమ్ బృందం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Shamshabad airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వరుసగా అక్రమ బంగారం పట్టుబడుతునే ఉంది. బంగారం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ఒ వైపు డిఆర్ఐ ఆధికారులు, మరో వైపు కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు.