భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది… కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. ఏకంగా 3 వేల వరకు కేసులు పెరిగాయి.. ఇక, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,156 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 733 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో 17,095 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు..
ఇక, తాజాగా 12,90,900 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.. దీంతో.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 60,44,98,405కు పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3.42 కోట్ల మందికి వైరస్ సోకగా.. 4,56,386 మంది బాధితులు ప్రాణాలు విడిచారు.. ప్రస్తుతం రికవరీ రేటు 98.20 శాతానికి పెరిగింది.. యాక్టివ్ కేసుల రేటు 0.47 శాతానికి తగ్గింది. మరోవైపు.. ఇక నిన్న 49,09,254 మంది కరోనా టీకా వేయించుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 104 కోట్ల మైలురాయిని కూడా క్రాస్ చేసింది.