ఈ నెల చివర్లో భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటన వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో టీం ఇండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. అయితే ఈ పర్యటనలో సౌత్ ఆఫ్రికా తో తలపడే టెస్ట్ జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వ్యవరించనుండగా… వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మను ఎంపిక చేసింది జట్టు. ఇన్ని రోజులు ఈ బాధ్యతలు నిర్వహించిన అజింక్య రహానే జట్టులో ఉన్న… అతడిని కేవలం ఆటగాడిగా మాత్రమే ఉంచింది.
అయితే గత కొన్ని రోజులుగా సరిగ్గా రాణించలేకపోవుతున్న రహానే ఈ పర్యటనకు దూరం అవుతాడు అని వార్తలు వచ్చిన అతనికి స్థానం దక్కింది. అలాగే కివీస్ సిరీస్ కు ఎంపిక చేయక భారత ఏ జట్టుతో సౌత్ ఆఫ్రికా పర్యటన పంపించిన హనుమ విహారిని ఈ జట్టులో చేర్చింది బీసీసీఐ. ఇక వికెట్ కీపర్ గా సాహా తో పాటుగా జట్టులోకి పంత్ తిరిగి వచ్చాడు. అలాగే పేసర్ బుమ్రా కూడా ఈ జట్టులో ఉన్నాడు. కానీ గాయాల కారణంగా గిల్, జడేజా, అక్షర్ పటేల్ ఈ పర్యటనకు దూరం అయ్యారు.
భారత టెస్ట్ జట్టు : విరాట్ కోహ్లీ (C), రోహిత్ శర్మ (VC), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, అజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్ (WK), వృద్ధిమాన్ సాహా (WK), ఆర్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మొహమ్మద్. షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, ఎండీ సిరాజ్.
స్టాండ్‌బై ప్లేయర్స్: నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జన్ నాగ్వాస్వాల్లా