భారత్ పర్యటన సందర్భంగా జరిగిన కొన్ని అనూహ్య సంఘటనలపై దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తాజాగా స్పందించారు. టీమిండియా స్టార్స్ జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు. మైదానంలో ఏం జరిగినా అది మైదానం వరకే పరిమితం చేయాలని, ఆ మాటలను మర్చిపోకుండా కసితో పోరాడాలన్నారు. అలాగే ప్రోటీస్ హెడ్ కోచ్ షుక్రీ కాన్రాడ్ చేసిన ‘గ్రోవెల్’ వ్యాఖ్య విషయంలో ఆయన మాటలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని బవుమా…
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. స్టేడియం పరిసరాల్లో భారీ పొగమంచు కారణంగా టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.25 వరకు అంపైర్లు పలుమార్లు మైదానాన్ని పరిశీలించారు. పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో చివరికి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశతో మైదానం వీడారు. మరోవైపు అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం…
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా అతడు వైదొలగాల్సి వచ్చిందని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. మూడో టీ20 మ్యాచ్‌లోనూ అక్షర్ ఆడని విషయం తెలిసిందే. వైద్య పరీక్షల నిమిత్తం ప్రస్తుతం అక్షర్ లక్నోలో జట్టుతోనే ఉన్నాడు. అతడి స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో రాణించడంతో…
ధర్మశాలలో జరిగిన టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యాన్ని సాధించింది. టాస్ గెలవడం భారత్‌కు కీలకంగా మారింది. భారత పేసర్లు అక్కడి వాతావరణాన్ని, పిచ్‌ను అద్భుతంగా వినియోగించుకున్నారు. పవర్ ప్లేలోనే కొత్త బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ, సౌతాఫ్రికా టాపార్డర్‌ను పూర్తిగా కూల్చేశారు. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా నిలకడైన లైన్స్, లెంగ్త్స్తో బౌలింగ్ చేసి, మొదటి…
India vs South Africa 3rd T20I: ధర్మశాల వేదికగా జరుగుతున్న భారత్, దక్షిణాఫ్రికా మూడో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణయం పూర్తిగా ఫలించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు భారత బౌలర్ల దెబ్బకు ఉక్కిరిబిక్కిరై నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 117 పరుగులకే ఆలౌటయ్యారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే సఫారీ జట్టుకు భారీ షాక్ తగిలింది. క్వింటన్ డికాక్ (1), రీజా హెండ్రిక్స్ (0)లు ఖాతా…
India vs South Africa 3rd T20I: భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ ధర్మశాల వేదికగా ఉన్న హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతోంది. ప్రస్తుతం 5 టీ20ల సిరీస్ 1-1తో సమంగా ఉంది. తొలి మ్యాచ్‌ను భారత్ భారీగా గెలవగా, రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల దృష్టి సిరీస్‌లో ఆధిక్యం సాధించడంపై ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా…
Shubman Gill Dropped: టీ20 జట్టులో శుభ్‌మన్ గిల్ స్థానం గురించి మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లకు గిల్‌ను జట్టు నుంచి తప్పించాలని సూచించారు.
Suryakumar Yadav: భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. టీ20 ఫార్మాట్లో అతడి బ్యాటింగ్ ఫామ్ క్షీణించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
2026 టీ20 వరల్డ్ కప్‌కు బెస్ట్ ప్లేయింగ్ XIను సిద్ధం చేయడమే తమ మెయిన్ టర్గెట్ అని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ చెప్పాడు. 2024 టీ20 వరల్డ్ కప్ తృటిలో చేజారిందని, ఈసారి మెగా టోర్నీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. సౌతాఫ్రికా 20, వరల్డ్‌కప్ సన్నాహక సిరీస్‌లతో బిజీ షెడ్యూల్ ఉందని.. ప్రతి ఆటగాడికీ తగిన అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. తుది జట్టుపై నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడూ అంత సులభం కాదని.. ఒక…
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ఓటమిపై భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఓటమికి పూర్తి బాధ్యత తనదే అని చెప్పాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం, బ్యాటింగ్‌లో వైఫల్యమే తమ ఓటమిని శాసించిందన్నాడు. తాను, శుభ్‌మన్ గిల్ బాధ్యత తీసుకుని నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. పిచ్ కండిషన్స్‌ను అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యామని, బౌలింగ్‌లో ప్లాన్ బీ కూడా లేదని సూర్య చెప్పుకొచ్చాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన…