ప్రపంచాన్ని కరోనాకు ముందు, కరోనాకు తరువాత అని విభజించవచ్చు. కరోనా నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వ్యాక్సినేషన్‌ను వేగంగా అందిస్తున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అన్నిదేశాలు సమిష్టిగా కృషి చేస్తున్నాయి. శాస్త్రవేత్తల కృషితో కరోనాకు వ్యాక్సిన్‌ను వేగంగా తయారు చేశారు. ధనిక, పేద దేశాలు అని తేడా లేకుండా అన్ని దేశాలకు వ్యాక్సిన్‌ను అందించేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ కోవాక్స్ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా పేద, మధ్యతరగతి దేశాలకు వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు.
Read: బల్గేరియాలో దారుణం… బస్సు దగ్దం…45 మంది సజీవదహనం..
ఇదంతా నాణానికి ఒకవైపు. మరోవైపు కరోనా మహమ్మారిని బూచిగా చూపి ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్నారు. పలు దేశాల్లోని ప్రభుత్వాలు అప్రజాస్వామ్యిక, అనవసర చర్యలు తీసుకుంటున్నారని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ సంస్థ ఓ నివేదికను తయారు చేసింది. కరోనాను కట్టడి చేసే క్రమంలో సుమారు 64 దేశాలు అనవసర, అనుచిత, అక్రమ చర్యలకు పూనుకున్నాయని ఐడీఈఏ తెలియజేసింది. అమెరికా, హంగేరీ, పోలెండ్, స్లోవేనియా వంటి దేశాల్లో కూడా కరోనా కారణంగా ప్రజాస్వామ్యానికి ఆదరణ తగ్గుతోందని నివేదికలో పేర్కొన్నది. మహమ్మారి వేళ దాదాపుగా 80 దేశాల్లో నిరసనలు జరిగినట్టు నివేదికలో పేర్కొన్నారు. ఇక ఆఫ్రికా ఖండంలో ప్రజాస్వామ్యానికి సంబంధించి గత మూడు దశాబ్దాలలో సాధించిన ప్రగతి కరోనా మహమ్మారి కారణంగా దాదాపు అంతరించిపోయిందని నివేదిక స్పష్టం చేసింది. యూరప్ దేశాల్లోనూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయని, వాటిని ప్రభుత్వాలు అణిచివేస్తున్నాయని నివేదిక తెలియజేసింది.