Medical Insurance: ఆస్పత్రిలో చేరకపోయినా.. ఇన్సూరెన్స్ క్లెయిమ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? పలు రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఆస్పత్రిలో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం 24 గంటల పాటు నిరీక్షిణ తప్పడం లేదా ? అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో చేరే వారికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో తిరస్కరణకు గురవుతుంటాయి. రోగి ఆస్పత్రిలో చేరకపోవడం, ఒక రోజంతా ఆస్పత్రిలో ఉండలేదనే కారణంతో ఇన్సూరెన్స్ కంపెనీలు మెడికల్ క్లెయిమ్స్ తిరస్కరిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో చేరకపోయినా లేదా 24 గంటల కంటే తక్కువ వ్యవధిలో అడ్మిట్ చేయబడినా కూడా బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు అని గుజరాత్‌లోని వడోదర వినియోగదారుల ఫోరమ్ స్పష్టం చేసింది.
Also Read: AP Budget 2023-24: అసెంబ్లీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టి బుగ్గన.. కేటాయింపులు ఇలా..
Also Read
ఆస్పత్రుల్లోకి చికిత్స కోసం వెళ్లిన రోగులు.. ఆస్పత్రికి వెళ్లి అక్కడ 24 గంటలు లేకున్నా.. లేక ఆస్పత్రిలో చేరకపోయినా బీమా క్లెయిమ్ చేసుకోవచ్చని చెందిన వినియోగదారుల ఫోరమ్ తీర్పు ఇచ్చింది. ఒక బీమా కంపెనీ.. ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరించడానికి సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఫోరం విచారించింది. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ట్రీట్‌మెంట్లు ఎంతో వేగంగా జరుగుతున్నాయని గుర్తు చేస్తూ బాధితులకు క్లెయిమ్ చెల్లించాల్సిందేనని ఆదేశింంచింది.
Also Read:Black Adam: ఒటీటీలో చూసిన తర్వాత అయిన ఈ క్యారెక్టర్ ని కంటిన్యూ చేస్తారా?
గుజరాత్ లోని వడోదరాకు చెందిన రమేశ్ చంద్రజోషి భార్య అనారోగ్యానికి గురై.. 2016లో అహ్మదాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో చేరారు. చికిత్స పూర్తయిన తర్వాత మరుసటి రోజే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వారికి ఇన్సూరెన్స్ ఉన్న కారణంగా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే దానిని బీమా కంపెనీ తిరస్కరించింది. రోగి 24 గంటలు ఆస్పత్రిలో లేరనే కారణాన్ని సదరు బీమా సంస్థ చూపింది. జోషి రూ. 44,468 ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం దాఖలు చేశారు. అయితే పాలసీలోని క్లాజ్ ప్రకారం 24 గంటల పాటు ఆమెను అడ్మిట్ చేయడం లేదని వాదిస్తూ క్లాజ్ 3.15ని పేర్కొంటూ సంస్థ దానిని తిరస్కరించింది. దీంతో బాధితుడు దీనిని సవాల్ చేస్తూ 2017లో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. నవంబర్ 24వ తేదీ సాయంత్రం 5.38 గంటలకు ఆస్పత్రిలో చేరి.. మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు డిశ్చార్జి అయ్యిందని, అంటే 24 గంటలు దాటిందని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించారు.
Also Read: Black Adam: ఒటీటీలో చూసిన తర్వాత అయిన ఈ క్యారెక్టర్ ని కంటిన్యూ చేస్తారా?
ఈ పిటిషన్ పరిశీలించిన వడోదరా వినియోగదారుల ఫోరం.. ఇప్పుడు కొత్తగా వస్తున్న టెక్నాలజీతో చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరిన తక్కువ సమయంలోనే ట్రీట్‌మెంట్ పూర్తి అవుతుందని పేర్కొంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో, రోగులు కొన్నిసార్లు తక్కువ సమయంలో లేదా ఆసుపత్రిలో చేరకుండానే చికిత్స పూర్తవుద్ది అని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ బీమా కంపెనీ క్లెయిమ్ తిరస్కరించడానికి వీల్లేదు అంటూ అభిప్రాయపడింది. ఇక క్లెయిమ్‌తో పాటు బీమా చేయించుకున్న వ్యక్తిని మానసికంగా ఇన్నేళ్లు వేధించినందుకు రూ.3 వేలు, పిటిషన్ ఖర్చులు రూ.2 వేలు కలిపి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలని బీమా సంస్థను వినియోగదారుల ఫోరం ఆదేశించింది.
తాజావార్తలు
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!