మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? పలు రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఆస్పత్రిలో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం 24 గంటల పాటు నిరీక్షిణ తప్పడం లేదా ? అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో చేరే వారికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో తిరస్కరణకు గురవుతుంటాయి.
ఆరోగ్యం బాగుపడిన డిశ్చార్జ్ చేయకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఆసుపత్రిలోనే ఉంచి యాజమాన్యం బెదిరించిన ఘటన ఎల్బీనగర్ లోని నక్షత్ర ఆస్పత్రిలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళ్తే.. ‘ నేను బాగానే ఉన్నాను.. ఆరోగ్యం కుదుటపడింది.. ఇంటికి వెళ్తాను, దయచేసి డిశ్చార్జ్ చేయండని పేషంట్ మొత్తుకుంటున్నా కూడా ఆస్పత్రిలోనే డాక్టర్లు బలవంతంగా ఉంచారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం.. నీకు సీరీయస్ గా ఉంది, మేము చేప్పే వరకు నువ్వు ఆస్పత్రిలోనే ఉండాలంటూ ఆస్పత్రి యాజమాన్యం బెదిరించింది. జ్వరంతో వచ్చిన…