Delhi Liquor Policy: ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం.. పాత ఎక్సైజ్ పాలసీ 6 నెలలు పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Liquor Policy: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పాత ఎక్సైజ్ పాలసీని ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ సర్కారు ప్రకటించింది. పాత ఎక్సైజ్ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం 6 నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా.. వీలైనంత త్వరగా కొత్త ఎక్సైజ్ పాలసీని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. అప్పటివరకు పాత పాలసీని కొనసాగించనుంది. పాత ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. ఈ ఆరు నెలల్లో ఐదు డ్రైడేలు ఉంటాయని.. మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, బుద్ధ పూర్ణిమ, ఈద్ ఉల్-ఫితర్, ఈద్ ఉల్-జుహా పండుగలు ఉన్న రోజుల్ని డ్రై డేలుగా ప్రకటించింది. ఈ 5 రోజుల్లో లిక్కర్ అమ్మకాన్ని నిషేధించింది.
Read Also: Himanta Biswa Sarma: వచ్చే 3 ఏళ్లలో పంజాబ్ జీడీపీని అస్సాం అధిగమిస్తుంది..
Also Read
ఢిల్లీ ప్రభుత్వం 2021-22 ఎక్సైజ్ పాలసీని గత ఏడాది ఆగస్టు 31న రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎక్సైజ్ పాలసీ అమలు విషయంలో అవకతవకలు జరిగాయని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆరోపణలు చేయడం.. సీబీఐ విచారణ చేయడంతో కొత్త పాలసీని రద్దు చేశారు. ఢిల్లీలో మద్యం కుంభకోణానికి సంబంధించి మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ ఇన్‌ఛార్జ్ మంత్రి మనీష్ సిసోడియాను ఇటీవల ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం, దేశ రాజధానిలో 570 రిటైల్ మద్యం దుకాణాలు, 950 కంటే ఎక్కువ హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు మద్యం అందించడానికి లైసెన్సులు కలిగి ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటిదాకా 10 మందికిపైగా అరెస్టయ్యారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవరెడ్డి, పలువురు వ్యాపారవేత్తలు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ ఒకసారి విచారించింది. ఇవాళ మరోసారి విచారించనుంది.
తాజావార్తలు
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!