Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం
- రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- యువత ఆందోళనకు మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు, రాజకీయ ప్రచారం నుంచి ప్రతిపక్షాలు వెనక్కి తగ్గబోవని స్పష్టం చేశారు. యువత చేస్తున్న నిరసనలకు తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో రాహుల్ గాంధీ స్పందిస్తూ.. తాను పదేళ్లకు పైగా నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్తో రాజకీయంగా పోరాడుతున్నానని పేర్కొన్నారు. వారి రాజకీయ విధానాలు, తీరుతెన్నుల గురించి తనకు పూర్తిగా తెలుసునని వ్యాఖ్యానించారు.
మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లను లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు చేశారు. ఈ పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపిస్తూ.. వారిపై రాజకీయ ఒత్తిడి పెరుగుతోందని వ్యాఖ్యానించారు. “మోడీజీ.. మీకు నచ్చినది చేసుకోండి. 10 వేల మంది, 20 వేల మంది, 50 వేల మంది పోలీసులను అయినా రంగంలోకి దించండి. మేము వెనక్కి తగ్గేది లేదు” అని పేర్కొన్నారు.
Also Read
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ప్రస్తుత రాజకీయ పోరాటంలో అవసరమైన సమాచారం తమ దగ్గర ఇప్పటికే ఉందని రాహుల్ గాంధీ అన్నారు. దేశ యువత చేస్తున్న నిరసనలపై గర్వంగా ఉందని పేర్కొంటూ.. ఆందోళనలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. “యువతా.. మీకు అండగా మేమున్నాం. రాజ్యాంగంపై దాడి చేసిన ఈ ప్రభుత్వాన్ని, దాని విధానాలను ఓడించేందుకు కృషి చేస్తాం” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేపట్టిన రాజకీయ ప్రచారం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అక్టోబర్ 10న చేపట్టిన నిరసన నేపథ్యంలో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణాత్మక పరిస్థితులు ఏర్పడినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఆందోళనలకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్నది నిరసనకారుల ప్రధాన డిమాండ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నివేదికల ప్రకారం.. ఢిల్లీ వ్యాప్తంగా 40 వేల మందికి పైగా పోలీసులు, పారా మిలిటరీ సిబ్బందిని మోహరించారు.
I’ve been fighting Narendra Modi and the RSS for over a decade now. I understand them like you would understand your opponent – inside out, like the back of my hand.
The core characteristic of these people is cowardice.
Narendra Modi, Amit Shah, Mohan Bhagwat, Gyanesh Kumar and Ajit Doval, the villains of this story, are slowly finding the space closing around them. We are closing that space.
Mr. Modi, do whatever you want. Call out all the police: 10,000, 20,000, 50,000, whatever you want.
Arrest all the leaders. Arrest all the young people. Arrest us all.
We are surrounding you, and we are not going to back down. Mark my words: we already have the information we need.
We are going to defend our Constitution. We are going to protect the voice of the Indian people. And we are going to ensure that what was done to India over the last 10-15 years will never, ever be done again.
Youth of India, I am proud of you. Keep protesting. We are standing with you.
We are going to ensure that this regime and the people who have attacked our Constitution are defeated.
मैं नरेंद्र मोदी, RSS और इनसे जुड़े लोगों के ख़िलाफ़ एक दशक से भी ज़्यादा समय से लड़ रहा हूँ। मैं अपने विरोधियों को उतनी अच्छी तरह समझता हूँ, जितना कोई भी अपने प्रतिद्वंद्वी को समझता है। मैं इन्हें अंदर तक जानता हूँ, इनकी हर चाल से वाक़िफ़ हूँ।
इन लोगों की सबसे बड़ी पहचान है – कायरता।
नरेंद्र मोदी, अमित शाह, मोहन भागवत, ज्ञानेश कुमार, अजीत डोभाल – इस कहानी के खलनायक – अब धीरे-धीरे घिरते जा रहे हैं। इनके चारों तरफ़ से दायरा सिमट रहा है।
जो करना है, कर लीजिए। जितनी पुलिस बुलानी है, बुला लीजिए – 10 हज़ार, 20 हज़ार, 50 हज़ार, जितनी चाहें बुला लीजिए।
सारे नेताओं को गिरफ़्तार कर लीजिए। सारे युवाओं को गिरफ़्तार कर लीजिए। हम सबको गिरफ़्तार कर लीजिए।
घबराइये मत – हम आपको चारों तरफ़ से घेर रहे हैं, और हम पीछे हटने वाले नहीं हैं।
मेरी बात याद रखिए – हमें जो जानकारी चाहिए, वह हमारे पास पहले से है।हम अपने संविधान की रक्षा करेंगे। हम हिंदुस्तान की जनता की आवाज़ की हिफ़ाज़त करेंगे। और हम यह सुनिश्चित करेंगे कि पिछले 10-15 सालों में हिंदुस्तान के साथ जो हुआ है, वह दोबारा कभी, किसी भी सूरत में न हो।
हिंदुस्तान के युवाओं, मुझे आप पर गर्व है। अपना विरोध जारी रखिए। हम आपके साथ खड़े हैं।
हम यह सुनिश्चित करेंगे कि इस सरकार और हमारे संविधान पर हमला करने वालों को शिकस्त मिले।
— Rahul Gandhi (@RahulGandhi) October 10, 2026
తాజావార్తలు
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!