Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- ఢిల్లీని బందీగా మార్చనివ్వం
- విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- శనివారం సీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆందోళణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు, పోలీసుల చర్యల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యం పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్.. కాక్రోచ్ జనతా పార్టీ (CJP)తో కలిసి వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.
సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో రేఖా గుప్తా స్పందిస్తూ.. వరుస ఎన్నికల ఓటములను జీర్ణించుకోలేక కొన్ని పార్టీలు తమ రాజకీయ అసహనాన్ని ఢిల్లీ ప్రజలపై చూపిస్తున్నాయని విమర్శించారు. రాజకీయ కార్యకలాపాల వల్ల ఉద్యోగాలకు వెళ్లే వారు, రోజువారీ కూలీలు, ఆస్పత్రులకు వెళ్లాల్సిన రోగులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో “ఢిల్లీని బందీగా మార్చనివ్వం” అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం పేరుతో అశాంతిని సృష్టించే ప్రయత్నాలకు గట్టిగా సమాధానం చెబుతామని హెచ్చరించారు.
Also Read
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
- CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
కుటుంబ రాజకీయాలు, రాజకీయ అవకాశవాదంతో నడిచే పార్టీలు ప్రజల తీర్పును అంగీకరించలేకపోతున్నాయని రేఖా గుప్తా ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కొంతమంది నాయకుల రాజకీయ ఆకాంక్షలు.. ఢిల్లీలోని లక్షలాది కుటుంబాల జీవనోపాధి, భద్రత, ప్రశాంతత కంటే ముఖ్యమా? అని ఆమె ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం ముసుగులో అరాచకాన్ని సృష్టించే రాజకీయాలను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం సుపరిపాలనకు ప్రాధాన్యం ఇస్తుందని రేఖా గుప్తా తెలిపారు. ఢిల్లీ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటూ తమకు మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావడాన్ని కూడా ప్రజల మద్దతుకు నిదర్శనంగా ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!