Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’. కేజీయఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇటు నందమూరి అభిమానులతో పాటు సినిమా ఆడియెన్స్ లోను భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల షూటింగ్ బ్రేక్ పడడంతో డీలా పడిన ఎన్టీఆర్ అభిమానులకు ఒక బిగ్ అప్డేట్ వచ్చేసింది. చేతి గాయం వల్ల కొద్దిరోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్ ఇప్పుడు దాని నుంచి కోలుకోవడంతో మళ్లీ సెట్స్ పైకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ స్టూడియోలో స్టార్ట్ అయింది. గత 4 రోజులు ఎన్టీఆర్ లేని పోర్షన్స్ షూట్ చేశారు. 14వ తేదీ నుంచి జరగబోయే ఈ తాజా షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొననున్నారు. ఎన్టీఆర్ రాకతో చిత్ర బృందం ఈ కొత్త షెడ్యూల్లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలు, ముఖ్యమైన సీన్లను పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక ఎన్టీఆర్ రీ-ఎంట్రీ వార్త తెలుసుకున్న అభిమానులు ‘డ్రాగన్’ మూవీకి సంబంధించిన తదుపరి అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిల్ కపూర్, బిజూ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 11న రిలీజ్ కాబోతున్న డ్రాగన్ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుందని ట్రేడ్ వర్గాలలో వినిపిస్తోంది.
Also Read
- Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
- Keerthy Suresh: షూటింగ్లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!
- Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
తాజావార్తలు
-
Theni Jail Escape: తమిళనాడులో కలకలం.. తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్!
-
Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు.. తెలంగాణాలోనూ భారీ వర్షాలు!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ, లేదంటే అంతే సంగతులు!
ట్రెండింగ్
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా