డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్, హాలీవుడ్ స్టార్ జాన్ సెనా ‘బిగ్ బాస్ 13’ విజేత సిద్ధార్థ్ శుక్లా మరణానికి సంతాపం తెలిపారు. సెనా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బాలికా వధు’ నటుడి ఫోటోను పోస్ట్ చేస్తూ నివాళులు అర్పించారు. సిద్దార్థ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేసిన సెనా ఎలాంటి క్యాప్షన్‌ని ఇవ్వలేదు. దీంతో సిద్ధార్థ్ అభిమానులు “పోస్ట్‌కు ధన్యవాదాలు సెనా” అంటూ కామెంట్లతో ఆ పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు. వరుణ్ ధావన్, అర్జున్ కపూర్,…
నటుడు సిద్ధార్ద్ శుక్లా యంగ్ ఏజ్ లో మరణించడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం కన్నుమూసిన ఆయన మృతదేహానికి నేడు పోస్ట్‌మార్టం పూర్తైయింది. అయితే ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో వైద్యుల సమక్షంలో పోలీస్ అధికారులు పోస్ట్‌మార్టమును చిత్రీకరించారు. ఈ నివేదిక ప్రకారం సిద్దార్థ్ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన గుండెపోటుతోనే మృతి చెందారని అందరూ భావిస్తున్నారు. అనంతరం అంత్యక్రియలకు సంబందించిన నివేదికను పోలీసులకు అందించారు. 1980…
రంగుల ప్రపంచంలో నటుల జీవితాలు కలర్ ఫుల్ గా ఉంటాయని అందరూ భావిస్తారు. అయితే వారి జీవితాలు తెర ముందు ఒకలా.. తెరవెనుక మరోలా ఉంటాయనేది కొంతమందికే తెలుసు. ఎన్నో కలలతో యువతీ యువకులు చిత్రసీమలోకి అడుగుపెట్టి సెలబ్రెటీలుగా మారాలని కోరుకుంటారు. అయితే లక్షల్లో ఒకరు మాత్రమే స్టార్డమ్ సంపాదిస్తుండగా మిగతా వారంతా వచ్చిన దారినే కనుమరుగై పోతున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకుంటే.. దూరపు కొండలు నునుపు అన్న చందంగా ప్రస్తుతం చిత్రసీమ తయారైంది. ముఖ్యంగా బాలీవుడ్…