ఎలన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల రంగంలో రారాజుగా వెలుగుతున్నారు. లక్షకోట్ల కంపెనీగా టెస్లా ఎదిగింది. అంతేకాదు, స్పెస్ ఎక్స్‌ను స్థాపించి అంతరిక్ష రంగంలో దూసుకుపోతున్నారు. వ్యాపార రంగంలో రాణిస్తున్న ఎలన్ మస్క్ అటు వివాదాలు సృష్టించడంలో కూడా అందరికంటే ముందు వరసలో ఉన్నారని చెప్పవచ్చు. ట్విట్టర్ కొత్త సీఈవో పరాగ్‌ను స్టాలిన్‌తో పోలుస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. రష్యాచరిత్రలో అప్పటి అధ్యక్షుడు స్టాలిన్, అతని అంతరంగికుడు నికోలయ్ యెజోవ్ కు మధ్య మంచి స్నేహం ఉన్నది. ఎక్కడికైనా ఇద్దరూ కలిసి వెళ్లేవారు. ఈ తరువాత ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
Read: “అఖండ” విజయానికి స్టార్స్ ఫిదా
ఆ తరువాత నికోలయ్ హత్యచేయబడ్డారు. స్టాలిన్, నికోలయ్ ఇద్దరూ కలిసి నదిఒడ్డున నడుస్తూ దిగిన ఫొటో అప్పట్లో బాగా పాపులర్ అయింది. నికోలయ్‌తో స్నేహం చెదిరిన తరువాత స్టాలిన్ ఆ ఫొటోను సెన్సార్ చేయించారు. నది ఒడ్డున స్టాలిన్ ఒక్కడే ఉన్న ఫొటోను మాత్రమే తరువాతి రోజుల్లో బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ ఫొటోను మార్ఫింగ్ చేసి స్టాలిన్ ప్లేస్‌లో ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను, నికోలయ్ ప్లేస్‌లో జాక్ డోర్సేను సెట్ చేశారు. రెండో ఫొటోలో కేవలం పరాగ్ అగర్వాల్‌ను మాత్రమే ఉంచి జాక్ డొర్సే ను తొలగించారు. ఈ ఫొటోను ఎలన్ మస్క్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వివాదాస్పదంగా మారింది. నెటిజన్లు మస్క్‌ను తిట్టిపోస్తున్నారు.