ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో మొదటిది ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణిత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. అయితే ఢిల్లీ ఓపెనర్లు నిరాశ పరిచిన తర్వాత శ్రేయాస్ అయ్యర్(43), పంత్(24) అర్ధశతక భాగసౌమ్యంతో ఇన్నింగ్స్ ను చక్కదిదే ప్రయత్నం చేసారు. కానీ పంత్ ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన హెట్మైర్(28) చేసాడు. ఇక చివర్లో అక్షర్ పటేల్ 7 బంతుల్లో 12 పరుగులు చేయడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది. ఇక రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్, చేతన్ సకారియా రెండేసి వికెట్లు తీయగా రాహుల్ తెవాటియా, కార్తీక్ త్యాగి ఒక్క వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఆర్ఆర్ 155 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ గెలిస్తే మళ్ళీ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోకి వెళ్లగా… రాజస్థాన్ గెలిస్తే 4వ స్థానంలోకి రానుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.