అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇవాళ కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 3 రోజులు విస్తారంగా వర్షాలు, పిడుగులు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. తెలంగాణలోని వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో వడగండ్లు పడ్డాయి. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి తదితర జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి.
Also Read:secunderabad: స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం… ఆరుగురు మృతి
ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిశాయి. రాయలసీమలోని అన్నమయ్య రాయచోటి, ప్రకాశం జిల్లాల్లో పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని సూచించింది. విశాఖ, అల్లూరి, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ.. అనకాపల్లి, కాకినాడ, జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు పడతాయని తెలిపింది. ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలు, పిడుగులు పడతాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read:Off The Record: టీఎస్‌పీఎస్సీపై లీకేజీల మచ్చ..! చైర్మన్ కంట్రోల్ తప్పిందా?