హుజురాబాద్ లో కీలకంగా మారనున్న పోస్టల్ బ్యాలెట్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులకు ప్రతి ఓటూ కీలకమే. టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగనున్న ఈ పోరులో ఎవరు గెలిచినా పెద్ద మెజార్టీ రాకపోవచ్చు. వందల ఓట్ల తేడానే ఉంటుందని పరిశీలకు బావిస్తున్నారు. దుబ్బాక కన్నా ఇంకా టఫ్ ఫైట్ ఉంటుందని బావిస్తున్నారు. నిరుడు జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన రావు, టీఆర్ఎస్ క్యాండిడేట్ సోలిపేట సుజాతా రెడ్డి మధ్య జరిగిన హోరీ హోరీ పోరు జరిగింది. రఘునందన రావు కేవలం వెయ్యి డెబ్బయ్ తొమ్మిది ఓట్లతో బయటపడ్డాడు. ఇప్పుడు హుజూరాబాద్‌లో కూడా అదే రిపీట్ అవుతుందని అంచనా. ఈ సారి ఎవరు అలా బయటపడతారో చెప్పలేం.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ రెండూ గెలుపు నాదంటే నాదన్న ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు చేయని ప్రయత్నం లేదు. గడప గడపకు వెళ్లి ఓటడుగుతున్నారు. ఇరు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో మకాం వేసి ప్రచారం హోరెత్తిస్తున్నారు. రాబోవు రోజుల్లో అది మరింత రసకందాయంలో పడనుంది. అయితే ఈ ఎన్నికల్లో నేతల తలరాతలు మార్చేది పోస్టల్ బ్యాలెట్లు. హుజూరాబాద్‌లో 12 వేల పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. ఇది ఈ సారి ఈ నియోజకవర్గం ప్రత్యేకత.
Also Read
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ఎన్నికల కమిషన్ అమలులోకి తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, వికలాంగులు, 80 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 4 వేల 454 మంది ఉన్నారు. వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం ఉంది. అలాగే 8 వేల 139 మంది వికలాంగ ఓటర్లు ఉన్నారు. వారు కూడా పోస్టల్ బ్యాలెట్ల ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
వృద్ధులు, వికలాంగులతో పాటు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా 147 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య 6 నుంచి 7 శాతం వరకు ఉంటుంది. ఇది ఎన్నికల్లో గెలుపు మార్జిన్ కావచ్చు. దీంతో హుజురాబాద్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చాలా కీలకంగా మారాయి. ప్రతి పోస్టల్ ఓటును తమకు అనుకూలంగా మలచుకోవడానికి రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. పార్టీలు ఇప్పటికే ఓటర్లను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. మూడు ప్రధాన పార్టీల కార్యకర్తలు తమకు ఓటు వేయమని పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. వారిని ఆకర్షించేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
-
Pawan Kalyan : పవన్ ఫోకస్‌తో పెదపెంకికి కొత్త జీవం
-
Klin Kaara : ‘పెద్ది’ బ్లాక్‌బస్టర్ హిట్.. నాన్న చరణ్‌కు క్లిన్ కారా అదిరిపోయే సర్ప్రైజ్
-
Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే..”కాక్రోచ్ జనతా పార్టీ” ఫ్లాప్ షో..
-
FIFA 2026 Last Chance: మెస్సీ, రొనాల్డోతో పాటు.. ఆ 14 మంది దిగ్గజాలకు ఇదే ఆఖరి వరల్డ్ కప్..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!