CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
- ట్యాంక్‌బండ్‌పై క్యాండిల్ ర్యాలీ
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందన
- 21 ఏళ్లకే ఎమ్మెల్యే పోటీకి తీర్మానం
- జెన్-జీకి విద్యాశాఖ మంత్రి హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత సాధించిన చారిత్రాత్మక విజయానికి మద్దతుగా, ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు నివాళులు అర్పిస్తూ హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఇందిరా గాంధీ విగ్రహం సాక్షిగా సాగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రచారం కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ , పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ఉత్సాహం, వారి ముఖాల్లోని విజయదరహాసం దేశ భవిష్యత్తుకు శుభసూచకమని కొనియాడారు.
దేశ యువత విజయం.. కాంగ్రెస్ ఖాతాలో వేసుకోం
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది పూర్తిగా దేశ యువత సాధించిన విజయమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవాలని అనుకోవడం లేదని తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యార్థులు సాగించిన ఐక్య పోరాటానికి అన్ని పక్షాల మద్దతు లభించిందని, అందుకే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రాజీనామా ఆమోదించక తప్పలేదని అన్నారు. అయితే, కేవలం ఒక రాజీనామాతో సరిపెట్టకుండా ఉద్యమంలో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కేంద్రం తక్షణమే భారీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులపై బనాయించిన అక్రమ కేసులను వచ్చే సోమవారం లోపు తక్షణమే ఎత్తివేయాలని కోరారు.
Also Read
21 ఏళ్లకే ఎమ్మెల్యే పోటీకి అర్హత: అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం
రాబోయే రోజుల్లో దేశ భవిష్యత్తును నిర్ణయించే బాధ్యత యువతదేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాడు రాజీవ్ గాంధీ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని గుర్తుచేశారు. “21 ఏళ్లకే మేయర్ కావచ్చు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కావచ్చు.. డిజిపి సి.వి. ఆనంద్ 22 ఏళ్లకే ఐపీఎస్ అయ్యారు. అలాంటప్పుడు చట్టసభల్లోకి ఎందుకు రాకూడదు?” అని ప్రశ్నించారు. వచ్చే ఆగస్టు మొదటి వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, 21 ఏళ్లకే యువత ఎమ్మెల్యేగా పోటీ చేసేలా చట్ట సవరణ కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధాని మోడీకి పంపుతామని హామీ ఇచ్చారు. 21 ఏళ్ల యువకుడు కేంద్రంలో మంత్రి అయితే దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
ఇన్స్టిట్యూషన్లను లొంగదీసుకున్నారు.. కానీ జెన్-జీ భయపడలేదు
ఇడి (ED), సీబీఐ (CBI) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి రాజకీయ నాయకులను లొంగదీసుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, జెన్-జీ (Gen-Z) యువతపై కూడా లాఠీలు జులిపించిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ యువత అదరక, బెదరక గుండె ధైర్యంతో ఎదురొడ్డి పోరాడి మోడీ అహంకారాన్ని ఓడించిందని అన్నారు. జంతర్ మంతర్ వద్ద మొదలైన ఈ జెన్-జీ సునామీ ఇక్కడితో ఆగకూడదని, వారి గొంతుక చట్టసభల్లో మోగాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, ఆయన క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రి బాధ్యతను జెన్-జీ ప్రతినిధికే అప్పగించేలా ఇండియా కూటమితో తాను మాట్లాడి ఒప్పిస్తానని ఇందిరమ్మ విగ్రహం ముందు సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు.
- Tags
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!