త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులకు ప్రతి ఓటూ కీలకమే. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగనున్న ఈ పోరులో ఎవరు గెలిచినా పెద్ద మెజార్టీ రాకపోవచ్చు. వందల ఓట్ల తేడానే ఉంటుందని పరిశీలకు బావిస్తున్నారు. దుబ్బాక కన్నా ఇంకా టఫ్ ఫైట్ ఉంటుందని బావిస్తున్నారు. నిరుడు జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన రావు, టీఆర్‌ఎస్ క్యాండిడేట్ సోలిపేట సుజాతా రెడ్డి మధ్య జరిగిన హోరీ హోరీ…