OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తుంగతుర్తి ఎమ్మెల్యే ఉన్నట్టుండి ఎందుకు అంతలా బ్లాస్ట్ అయ్యారు? ఏకంగా మంత్రికే సీరియస్ వార్నింగ్ ఇవ్వడం వెనకున్న స్టోరీ ఏంటి? గదిలో పెట్టి కొడితే పిల్లి అయినా పులి అవుతుందని గుర్తు చేస్తున్నారా? ఇప్పటికైనా నోరు తెరవకుంటే తన ఉనికే ప్రమాదంలో పడుతుందని భయపడ్డారా? ఎస్సీ నియోజకవర్గంలో కొందరు సీనియర్ నేతల జోక్యం శృతిమించుతోందా? తుంగతుర్తిలో అసలేం జరుగుతోంది? ఎమ్మెల్యే ఫైర్ వెనకున్నది ఆవేదనా? లేక రాజకీయమా?
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ బరస్ట్ అయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుల మీద విరుచుకుపడ్డారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో మీ పెత్తనం ఏంటంటూ మండిపడ్డారు. సమాచారం ఇవ్వకుండా, ప్రోటోకాల్ పాటించకుండా నా నియోజకవర్గానికి ఎలా వస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డిని ప్రశ్నించారు ఎమ్మెల్యే. దళిత ఎమ్మెల్యేలంటే అంత చులకనా అంటూనే…. తన జోలికి వస్తే, ఇదే విధంగా అవమానిస్తే మీ రాజకీయానికి చావు డప్పేనని హెచ్చరించారు కూడా. అయితే… సొంత పార్టీకి చెందిన మంత్రి, మరో ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యే మందుల ఆ స్థాయిలో విరుచుకుపడ్డం కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతోంది. తుంగతుర్తి శాసనసభ్యుడి ఫ్రస్టేషన్‌కు కారణం ఏంటి? ఈ విషయంలో దోషులెవరు? బాధితులు ఎవరన్న డిస్కషన్స్ జోరుగా నడుస్తున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గం… గత పునర్విభజనకు ముందు జనరల్ కోటాలో ఉండేది. అప్పట్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి
ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించేవారు.
Also Read
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారాయన. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు… రాంరెడ్డి దామోదర్ రెడ్డికి కూడా తుంగతుర్తి కంచుకోట. ఇక పునర్విభజన తర్వాత ఇది ఎస్సీ రిజర్వు అవడంతో సూర్యాపేటకు షిఫ్ట్ అయ్యారు దామోదర్ రెడ్డి. అయినాసరే… ఇక్కడి తన కేడర్‌ను అలాగే మెయింటైన్ చేశారు. ఆ రకంగా సూర్యాపేట, తుంగతుర్తి రెండు నియోజకవర్గాలను శాసించారాయన. రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ఆశీస్సులు ఉన్నవారే తుంగతుర్తి ఎమ్మెల్యే అవుతారనే అభిప్రాయం అప్పట్లో ఉండేది. ఇక ఈ అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి పార్లమెంటు పరిధిలోనిది కావడంతో… 2009-14 మధ్య భువనగిరి ఎంపీగా పనిచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… 2019లో ఎంపీగా ఎన్నికైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి… తమ సొంత కేడర్‌ను తయారు చేసుకున్నారు. ఇక తాజాగా కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన చామల సైతం తానేం తక్కవకాదన్నట్టు వ్యవహరిస్తుండటంతో… దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, చామల వర్గాలకు చెందిన క్యాడర్ అంతా బలమైన వర్గంగా ఏర్పడింది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ మందుల శామ్యూల్….. కారు దిగి హస్తానికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఆయన్ని గెలిపించుకునేందుకు రేవంత్ రెడ్డితో సహా.. సీనియర్ నేతలు తలో చెయ్యి వేయడం, శామ్యూల్‌కు ఉన్న ఉద్యమ నేపధ్యం కలిసివచ్చాయి. పైగా… స్థానికుడు కావడం, నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గం ఓట్లు భారీగా ఉండటం కూడా గెలుపునకు కారణం అయ్యాయని అంటారు.
ఎమ్మెల్యేగా మందుల గెలిచినా…. నియోజకవర్గంలో పెత్తనం అంతా సీనియర్స్దే అన్నట్టు ఇంతకాలం సాగింది. కానీ…. ఇక మీదట సీనియర్ల పెత్తనానికి చెక్ పెట్టాలని అనుకున్న శాసనసభ్యుడు తన వెంట పార్టీ మారి వచ్చిన వారికే పదవులు కట్టబెట్టారట. చివరకు మండల అధ్యక్ష పదువుల్ని సైతం తన మనుషులకే ఇప్పించుకుని ఆధిపత్యం చాటుకున్నారాయన. మండల పార్టీ అధ్యక్షుల ఎంపికపై తన అభ్యంతరాలను ఇంటర్నల్‌గా చర్చించాల్సిన ఎంపీ చామల… లేఖ రాయడం, అది బహిర్గతం అవడం వరుసగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియోజకవర్గానికి రావడం, ఎమ్మెల్యే లేకుండానే మంత్రి అభివృద్ధి పనుల్ని పరిశీలించడంతో రగిలిపోయారట ఎమ్మెల్యే శామ్యూల్. ఈ క్రమంలోనే తుంగతుర్తి కాంగ్రెస్‌లో విభేదాలు రోడ్డెక్కాయని అంటున్నారు. నియోజకవర్గ వ్యవహారాల్లో సీనియర్ల అతి జోక్యంపై రెండున్నర ఏళ్లుగా అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే మందుల తాజా పరిణామాలతోనే బ్లాస్ట్ అయినట్టు చెప్పుకుంటున్నారు. మండలం పార్టీ అధ్యక్షుల ఎంపిక వ్యవహారంలో జరిగిన రచ్చ ఇప్పటికే గాంధీభవన్ కు చేరగా… తాజా బ్లాస్ట్ ఎపిసోడ్ కూడా గాంధీభవన్‌లో గాంధేయ మార్గంలోనే పరిష్కారం అవుతుందా? లేక ఢిల్లీ చేరుతుందా అన్న చర్చలు మొదలయ్యాయి తుంగతుర్తిలో.
తాజావార్తలు
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?