3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HMD Touch AI: HMD గ్లోబల్ HMD Touch AI పేరుతో కొత్త ఫీచర్ ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. ఒకప్పుడు ఎంతో ఆదరణ పొందిన నోకియా లూమియా (Nokia Lumia) సిరీస్‌ను గుర్తు చేసే డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్లో టచ్‌స్క్రీన్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను అందించారు. ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలో మాత్రమే ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉండగా.. ఇతర దేశాల్లో ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
HMD Touch AIలో పాలీకార్బోనేట్ యూనీబాడీ డిజైన్‌ను పోలి ఉండే నిర్మాణాన్ని ఉపయోగించారు. ఫోన్లో 3.2 అంగుళాల టచ్‌స్క్రీన్ ఉండటం వల్ల ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్ఫోన్లతో పోలిస్తే చాలా చిన్నదిగా కనిపిస్తుంది. సియాన్ (Cyan) రంగులో ఫోన్ అందుబాటులో ఉండగా.. పసుపు, నీలం, తెలుపు రంగుల్లో మార్చుకునే బ్యాక్ కవర్లను కంపెనీ విడిగా అమ్మనుంది. పైభాగంలో ఉన్న ప్రత్యేక ఫిజికల్ బటన్‌ను వినియోగదారులు SOS అలర్ట్ లేదా టార్చ్‌లైట్ కోసం అనుకూలంగా సెట్ చేసుకోవచ్చు.
Also Read
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- 165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- 2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
ఈ ఫోన్లో TikTok మాతృసంస్థ ByteDance అభివృద్ధి చేసిన Doubao AI మోడల్‌ను ఉపయోగించారు. ఇందులో మొత్తం 6 AI అసిస్టెంట్లు ఉండనున్నాయి. వీటి ద్వారా చైనీస్, ఇంగ్లిష్ భాషల మధ్య తక్షణ అనువాదం అలాగే ప్రశ్నలకు సమాధానాలు, కథలు చెప్పడం, భావోద్వేగ మార్గదర్శనం, టెక్స్ట్ ఆధారంగా చిత్రాల సృష్టి వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు విద్యార్థుల కోసం హోంవర్క్‌ను గుర్తించి నేరుగా సమాధానం చెప్పకుండా, పరిష్కార పద్ధతిని వివరించే AI లెర్నింగ్ ఫీచర్ కూడా ఉంది. మాట్లాడే ఇంగ్లిష్ సాధనకు ఉచ్చారణ, వ్యాకరణ సవరణల సౌకర్యం కూడా అందిస్తుందని సమాచారం.
ధరకు తగ్గట్టుగానే HMD Touch AIలో సాధారణ హార్డ్‌వేర్‌ను అందించారు. ఫోన్ వెనుక భాగంలో 2MP కెమెరా, ముందు భాగంలో కూడా 2MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఫొటోగ్రఫీ కోసం AI ఇమేజ్ రికగ్నిషన్, AI ఇమేజ్ జనరేషన్, ఫొటోలను యానిమేషన్, కామిక్, సంప్రదాయ చైనీస్ పెయింటింగ్ స్టైల్లుగా మార్చే ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అలాగే రెట్రో CCD కెమెరా ఎఫెక్ట్‌ను కూడా అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఫోన్లో 1,950mAh బ్యాటరీ, USB Type-C ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు.
HMD Touch AI ఒక క్లోజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. దీంతో ఇందులో Google Play Store లేదా ఇతర థర్డ్ పార్టీ యాప్‌లను ఇన్స్టాల్ చేసుకునే అవకాశం ఉండదు. అలాగే షార్ట్ వీడియో యాప్‌లకు కూడా సపోర్ట్ ఉండదని నివేదికలు చెబుతున్నాయి. అయితే MP3 ప్లేయర్, క్యాలెండర్, అలారం, వరల్డ్ క్లాక్, కాలిక్యులేటర్, యూనిట్ కన్వర్టర్, డిస్ప్లే బ్రైట్నెస్ నియంత్రణ వంటి పలు ఉపయోగకరమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పేరెంటల్ కంట్రోల్స్, బ్లాక్‌లిస్ట్, వైట్‌లిస్ట్ వంటి భద్రతా ఫీచర్లను కూడా అందించారు.
HMD Touch AI ధర 469 చైనా యువాన్స్ (రూ.6,700). ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలో మాత్రమే ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. అమెరికా, యూరప్ లేదా భారత్ వంటి మార్కెట్లలో ఈ ఫోన్‌ను విడుదల చేసే విషయంపై HMD ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. Nokia Lumia డిజైన్‌ను మళ్లీ తీసుకురావడం ద్వారా పాత Lumia అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నంగా ఈ ఫోన్‌ను పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఇది చైనా మార్కెట్‌కే పరిమితమైంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!