బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన సోదరుడిపై పరువు నష్టం కేసు వేశాడు. రూ.100 కోట్ల దావా వేశాడు. ఈ ఇద్దరు సోదరుల మద్య వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, అతని సోదరుడు షమాసుద్దీన్‌లు తమ మధ్య ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల దృష్ట్యా సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ఎలాంటి వ్యాఖ్యలను పోస్ట్ చేయవద్దని బాంబే హైకోర్టు ఆదేశించింది.
Also Read:Off The Record: గ్రూపుల గోల.. నిరసనల సెగ.. డిప్యూటీ సీఎంకు తలనొప్పులు..!
సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ.. పరువు నష్టం కలిగించే ప్రకటనలను పోస్ట్ చేసినందుకు తన సోదరుడి నుండి రూ. 100 కోట్ల నష్టపరిహారం కోరుతూ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కోర్టును ఆశ్రయించాడు. ఆయన దాఖలు చేసిన పరువు నష్టం దావాను విచారిస్తున్నప్పుడు జస్టిస్ ఆర్‌ఐ చాగ్లాతో కూడిన సింగిల్ బెంచ్ కీలక ఆదేశాలు ఇచ్చింది. మే 3న తమ న్యాయవాదులతో కలిసి తన ఛాంబర్‌లో ఉండాల్సిందిగా సోదరులను ధర్మాసనం ఆదేశించింది.
దావాలో నటుడి మాజీ భార్య జైనాబ్ పేరు కూడా ఉంది. అయితే మాజీ జంట తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నందున నటుడు ఆమెపై పరువు నష్టం దావా వేయడానికి ఇష్టపడలేదని బుధవారం నవాజుద్దీన్ సిద్ధిఖీ న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ కోర్టుకు చెప్పారు.
Also Read:MK Stalin Urges : గవర్నర్ వర్సెస్ సర్కార్.. బీజేపీయేతర రాష్ట్రాలకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
హైకోర్టు డివిజన్ బెంచ్ జోక్యంతో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అతని మాజీ భార్య మధ్య సెటిల్‌మెంట్ చర్చలు జరుగుతున్నాయి. ఈ బెంచ్ సాయంతో చర్చలు జరుగుతున్నాయని షమాసుద్దీన్ సిద్ధిఖీ తరఫు న్యాయవాది రూమీ మీర్జా హైకోర్టుకు తెలిపారు. పోరాడుతున్న సోదరుల మధ్య ఇదే విధమైన ఏర్పాటు జరగవచ్చు అని అన్నారు.
అయితే, షామసుద్దీన్ సిద్ధిఖీ తన పరువు నష్టం కలిగించే పోస్ట్‌లను తీసివేసినప్పుడు మాత్రమే సోదరుల మధ్య ఏదైనా చర్చలు ప్రారంభమవుతాయని చంద్రచూడ్ అన్నారు. ఇందులో అవార్డు గెలుచుకున్న నటుడిని “రేపిస్ట్ మరియు వేధింపుదారు” అని పేర్కొన్నారని తెలిపారు.
Also Read:Millie Bobby Brown: అందాల భామల టీనేజ్ మ్యారేజెస్!
వాదనల అనంతరం పోస్ట్‌లను తొలగించాలని, సోదరులిద్దరూ ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలని కోర్టు సూచించింది. సెటిల్‌మెంట్ చర్చల దృష్ట్యా, సామరస్యపూర్వకమైన పరిష్కారానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. ఒకరికొకరు వ్యతిరేకంగా ఎలాంటి పోస్ట్‌లు ఉండకూడదు అని జస్టిస్ చాగ్లా అన్నారు.