వంగవీటి రాధాకు సెక్యూరిటీ పెంపు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వంగవీటి రంగా వర్థంతి సభలో తాజాగా వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారని రాధా సంచలనానికి తెరలేపారు.. తననేదో చేద్దామని కుట్ర చేశారని.. దేనికీ భయపడనని రాధా స్పష్టం చేవారు. తాను ప్రజల మధ్య ఉండే మనిషినని చెప్పిన రాధా.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. అయితే, ఇవాళ వంగవీటి రాధాకు సెక్యూరిటీ పెంచింది ఏపీ ప్రభుత్వం.. వంగవీటి రాధాకు 2+2 భద్రత కల్పించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని మీడియాకు తెలిపారు మంత్రి కొడాలి నాని..
వంగవీటి రాధా తనను చంపటానికి రెక్కీ నిర్వహించారని నా దృష్టికి తీసుకు వచ్చారని తెలిపిన మంత్రి కొడాలి నాని.. నేను ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాను.. ఇంటలిజెన్స్ డీజీని సీఎం అలెర్ట్ చేశారు.. రాధాకు 2 ప్లస్ 2 గన్ మెన్ భద్రత కల్పించాలని సీఎం ఆదేశించారని తెలిపారు.. సీఎం జగన్ వెంటనే స్పందించి ఆదేశాలు ఇచ్చారని.. ఆధారాలు సేకరించమని, వాటి సంబంధించిన నివేదిక ఇవ్వమని పోలీస్ అధికారులకు సీఎం ఆదేశించారని మీడియాకు వెల్లడించారు.. ఇక, రాధా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన మంత్రి కొడాలి నాని.. రాధాకు రాజకీయంగా ఓనమాలు నేర్పాల్సిన అవసరం లేదన్నారు.. వంగవీటి రంగా 33వ వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు అయ్యాను.. కానీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో.. రాధా చేరికపై ఎలాంటి చర్చా జరగలేదన్నారు కొడాలి నాని. కాగా, ప్రస్తుతం వంగవీటి రాధా టీడీపీలో కొనసాగుతుండగా.. తాజాగా ఆయన సంచనల వ్యాఖ్యలు చేయడం.. వెంటనే ప్రభుత్వం భద్రత పెంచడం ఆసక్తికరంగా మారింది.
Also Read
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్‌పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
- Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
- Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
తాజావార్తలు
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్‌లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్‌కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!