Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Festive Sale: పండుగల సీజన్ మొదలవడంతో ఇండియన్ ఆన్లైన్ మార్కెట్ సేల్స్ సునామీని చూస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, జియో వంటి ఈ-కామర్స్ దిగ్గజాలు ప్రకటించిన ఫెస్టివల్ సేల్స్ స్టార్ట్ అయిన మొదటి రెండు రోజుల్లోనే రికార్డు స్థాయి వ్యాపారం నమోదైంది. కేవలం 48 గంటల వ్యవధిలోనే వినియోగదారులు దాదాపు రూ. 24,200 కోట్ల (2.5 బిలియన్ డాలర్లు) విలువైన వస్తువులను కొనుగోలు చేసినట్లు ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ ‘రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్’ తన తాజా నివేదికలో వెల్లడించింది. రెడ్‌సీర్ లెక్కల ప్రకారం.. ఈ రెండు రోజుల్లోనే దేశవ్యాప్తంగా సుమారు 6 నుంచి 6.5 కోట్ల మంది యూజర్స్ పండుగ సేల్స్‌లో భాగస్వామ్యమయ్యారని వెల్లడించింది. వివిధ ప్లాట్‌ఫామ్‌లలో కలిసి మొత్తం 8 నుంచి 9 కోట్ల ఆర్డర్లు వెల్లువెత్తాయి. సాధారణ రోజుల్లో నమోదయ్యే సగటు బిజినెస్‌తో పోలిస్తే ఇది ఏకంగా 6 రెట్లు ఎక్కువ కావడం విశేషం. అంతేకాదు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు స్పీడ్ డెలివరీల కోసం ప్రవేశపెట్టిన ‘క్విక్ కామర్స్’ విభాగాలు కూడా సాధారణ రోజుల కంటే 4 నుంచి 5 రెట్లు అధిక వ్యాపారాన్ని నమోదు చేశాయి.
మొబైల్ ఫోన్లదే అగ్రస్థానం..
ఈ భారీ కొనుగోళ్లలో అత్యధిక వాటా స్మార్ట్ఫోన్లదే నిలిచింది. డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు భారీగా ఉండటంతో వినియోగదారులు కొత్త ఫోన్ల కొనుగోలుపై ఎక్కువగా మొగ్గు చూపారు.
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
* మొబైల్ ఫోన్లు: మొత్తం అమ్మకాల్లో 38 నుంచి 40 శాతం వాటాను కైవసం చేసుకున్నాయి. వీటి విలువ దాదాపు రూ.9,100 కోట్ల నుంచి రూ.9,600 కోట్లుగా ఉంది.
* కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ & గృహోపకరణాలు: దాదాపు 25 నుంచి 27 శాతం (రూ.6,000 – రూ.6,500 కోట్లు) వాటాతో రెండో స్థానంలో నిలిచాయి. టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్ వంటి పెద్ద గృహోపకరణాల అమ్మకాలు మార్కెట్ అంచనాలను మించి దూసుకుపోయాయి.
* ఫ్యాషన్ ఉత్పత్తులు: 15 నుంచి 18 శాతం (రూ.3,630 – రూ.4,350 కోట్లు) వాటాను దక్కించుకున్నాయి.
గతంలో మెట్రో నగరాలకే పరిమితమైన ఈ-కామర్స్ క్రేజ్ ఇప్పుడు టైర్-2, చిన్న నగరాలకు విస్తరించింది. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్యాషన్ దుస్తులకు చిన్న పట్టణాల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ స్టార్టింగ్ రెండు రోజుల్లో షాపింగ్ చేసిన వారిలో దాదాపు మూడో వంతు (33 శాతానికి పైగా) ‘జెన్ జెడ్’ యూజర్స్ ఉండటం గమనార్హం. కేవలం మొదటి 48 గంటల్లోనే రూ.24 వేల కోట్ల మార్కును తాకిన ఈ-కామర్స్ సేల్స్.. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!