El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో కరువు ముప్పు
- రెండో పంట వేయొద్దంటూ రైతులకు మంత్రి విజ్ఞప్తి
- యూనిట్ రూ.15 పెట్టినా దొరకని విద్యుత్
- నీటి ఎద్దడిపై ప్రత్యేక కేబినెట్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
El Nino : రాష్ట్రంలో రానున్న కాలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న ‘ఎల్‌నినో’ (El Nino) పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో సాగు నీటితో పాటు రాబోయే రోజుల్లో తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పొలాల్లో ఉన్న మొదటి పంటను ఎలాగైనా కష్టపడి వంద శాతం కాపాడుకుంటామని, అయితే రైతులు ఎవరూ కూడా దయచేసి రెండో పంట (యాసంగి/వేసంగి) వేయవద్దని ఆయన ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేశారు.
విద్యుత్ కొనుగోలు భారంగా మారింది..
రాష్ట్రంలో తలెత్తబోయే విద్యుత్ సంక్షోభం, కరెంటు ఇబ్బట్లపై మంత్రి పొంగులేటి స్పష్టతనిచ్చారు. పవర్ గ్రిడ్‌లో డిమాండ్‌కు తగినట్లుగా విద్యుత్ సరఫరా చేయడం కష్టంగా మారుతోందని, విద్యుత్‌ను బయటి మార్కెట్ నుంచి కొనుగోలు చేయాలంటే యూనిట్‌కు రూ. 15 వెచ్చించినా దొరకని దయనీయ పరిస్థితి నెలకొందని తెలిపారు. అందువల్ల ప్రజలందరూ కూడా విద్యుత్‌ను అత్యంత పొదుపుగా వాడుకోవాలని కోరారు. ఒకవేళ రైతులు ఎవరైనా రెండో పంట వేస్తే.. అటు ప్రభుత్వం నీటిని, విద్యుత్‌ను సరఫరా చేయలేక సతమతమవుతుందని, ఇటు రైతులు తీవ్రంగా నష్టపోయి ఆర్థికంగా బాధపడాల్సి వస్తుందని ఆయన హితవు పలికారు. రైతులు ఈ పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
Also Read
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
రేపు, ఎల్లుండి కేబినెట్ భేటీ.. కేంద్రం పాత్రపై చర్చ
వర్షాభావ పరిస్థితులు, తాగు-సాగు నీటి ఎద్దడి, విద్యుత్ కొరతను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలో చర్చించేందుకు రేపు, ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశం (Cabinet Meeting) జరగనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కేబినెట్ భేటీలో సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ చర్యలపై చర్చిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి కరువు నివారణకు, రాష్ట్రానికి అండగా నిలవాలని ఈ సమావేశంలో తీర్మానించి విజ్ఞప్తి చేస్తామన్నారు. త్వరలోనే అన్ని రాజకీయ పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం (All-Party Meeting) ఏర్పాటు చేసి, ఎల్‌నినో ప్రభావంపై వారి నుంచి విలువైన సలహాలు, సూచనలు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!