PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- దేశ, ప్రపంచ సమస్యల్ని పరిష్కరించే సత్తా యువత సొంతం..
- యువత పెద్ద కలలు కనాలి, భిన్నంగా ఆలోచించాలి..
- చెన్నైలో యువతను ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ ప్రసంగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు అందించే సామర్థ్యం యువతలో ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. యువత తమ భవిష్యత్తును విశాల దృక్ఫథంతో చూడాలని, పెద్ద కలలు కనాలని, కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇది యువతకు సరైన సమయమని, తమ సామర్థ్యాలను నిరూపించుకునేందుకు వచ్చిన అవకాశమని పేర్కొన్నారు. చెన్నై లోని నందంబాక్కంలో చెన్నై ట్రేడ్ సెంటర్లో జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ స్వర్ణోత్సవ కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు.
అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి అవసరమైన కొత్త ఆలోచనలు, పరిష్కారాలు దేశ భవిష్యత్తును మాత్రమే కాకుండా ప్రపంచ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతాయని ప్రధాని అన్నారు. భారత్‌లో యువతకు అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు. తాను వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని, కాశీ ప్రతినిధినని మోడీ అన్నారు. ప్రముఖ కవి సుబ్రమణ్య భారతి రచనల్ని ప్రస్తావిస్తూ.. యువత భయం లేకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
Also Read
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ఢిల్లీలో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా యువత నిరసన తెలుపుతున్న సమయంలో ప్రధాని మోడీ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. యువత ఆలోచనలతో పనిచేయాలని, పెద్ద కలలు కనాలని, భిన్నంగా ఆలోచించాలని, నిర్భయంగా ముందుకు సాగాలని సూచించారు. దేశంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, సమిష్టిగా పనిచేస్తే లక్ష్యాలు సాధించవచ్చని అన్నారు.
తాజావార్తలు
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!