పంజాబ్‌లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సిద్ధూను ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరమీదకు తీసుకొస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తానని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. సిద్ధూ నిలకడ లేని మనిషి అని, పాక్ సీఎం, ఆర్మీ చీఫ్‌తో సిద్ధూకు సంబంధాలు ఉన్నాయని, వారంతా స్నేహితులని అన్నారు. దేశం కోసం సిద్ధూని తప్పకుండా వ్యతిరేకిస్తానని, పాకిస్తాన్‌కు పంజాబ్ ఆయుధంగా మారుతుందేమో అని భయపడుతున్నానని అన్నారు. అందుకే సిద్ధూను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు అమరీందర్ సింగ్ పేర్కొన్నారు.