రాజస్థాన్‌లో ఇంటర్నేషనల్ పుష్కర్ ఫెయిర్ జరుగుతున్నది. ఈ పుష్కర్ ఫెయిర్‌లో ప్రదర్శించేందుకు అనేక గుర్రాలను, మేలుజాతి పశువులను తీసుకొస్తారు. నచ్చిన వాటికి ఎంత ధర ఇచ్చైనా కొనుగోలు చేస్తుంటారు. ఇక ఈ పుష్కర్ ఫెయిర్‌లో పంజాబ్‌లోని బరిండా నుంచి అల్భక్ష్ జాటి గుర్రం సందడి చేసింది. పోడవైన కాళ్లు, బలమైన శరీరం, అందమైన రూపంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ గుర్రాన్ని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. కొంతమంది కోటికి పైగా ఇస్తామని ముందుకు వచ్చారు.
Read: భర్త ఇంటికి రావడం లేదని… హైకోర్టులో మిస్సింగ్ కేసు దాఖలు…
ఎంత డబ్బు ఇచ్చినా ఆ గుర్రాన్ని ఎవరికీ అమ్మబోనని దాని యజమాని సందీప్ సింగ్ పేర్కొన్నారు. అల్భక్ష్ ఇంట్లో కుటుంబసభ్యునిగా మారిపోయిందని, ఎంత ఇచ్చినా ఇచ్చేది లేదని తెలిపారు. పుష్కర్ ఫెయిర్‌కు తీసుకురావాలని అనుకున్నానని, తీసుకొచ్చానని ఆయన తెలిపారు. ఇలాంటి గుర్రాలను రాజులు యుద్దాల కోసం వినియోగించేవారని, ఎంత దూరమైన అలుపు లేకుండా పరుగులు తీస్తుంటాయని అన్నారు. ఈ గుర్రం కోసం 24 గంటలు ఒక బాడీగార్డ్ ఉంటాడని, గుర్రం ఆహారానికి నెలకు రూ.50 వేలు ఖర్చు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.