భ‌ర్త ఇంటికి రావ‌డం లేద‌ని… హైకోర్టులో మిస్సింగ్ కేసు దాఖ‌లు…

భ‌ర్త ఇంటికి రావ‌డంలేద‌ని చెప్పి ఓ మ‌హిళ మ‌ద్రాస్ హైకోర్టులో హెబియ‌స్ కార్ప‌స్ కేసు దాఖ‌లు చేసింది. సెప్టెంబ‌ర్ 15 వ తేదీ నుంచి క‌నిపించ‌డంలేద‌ని కేసులో పేర్కొన్న‌ది.  ఈ కేసును స్వీక‌రించిన హైకోర్టు ఆమె భ‌ర్త‌ను వెతికి కోర్టులు హాజ‌రుప‌ర‌చాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది.  హైకోర్టు ఆదేశాల మేర‌కు పోలీసులు ద‌ర్యాప్తును వేగంగా ముగించారు.  ద‌ర్యాప్తు నివేదిక‌ను కోర్టుకు స‌మ‌ర్పించారు.  పోలీసుల నివేదిక‌ను చూపి హైకోర్టు షాక్ అయింది.

Read: నేటి నుంచి శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి భ‌క్తుల అనుమ‌తి… నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రి…

 పిటిష‌న్ దాఖ‌లు చేసిన మ‌హిళ‌పై కోర్టు సీరియ‌స్ అయింది.  పిటిష‌న‌ర్ భ‌ర్త క్షేమంగా ఉన్నార‌ని,  రాజ‌స్థాన్ లోని బార్మ‌ర్ బోర్డ‌ర్ సెక్యూరిటీగా ప‌నిచేస్తున్నార‌ని, త‌ర‌చుగా పిటిష‌న‌ర్‌తో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నార‌ని నివేదిక‌లో పేర్కొన్నారు.  దీనిపై కోర్టు పిటిష‌న‌ర్‌ను వివ‌ర‌ణ కోరింది.  త‌న భ‌ర్త ఇంటికి రావ‌డం లేదని, త‌న‌తో స‌రిగా మాట్లాడ‌టం లేద‌ని, ఆయ‌న్ను త్వ‌ర‌గా ఇంటికి ర‌ప్పించాల‌ని చెప్పి పిటిష‌న్‌ను దాఖ‌లు చేసిన‌ట్టు ఆమె కోర్టుకు తెలిపింది.  కోర్టు స‌మ‌యాన్ని వృధా చేసినందుకు పిటిష‌న‌ర్‌కు రూ.15 వేలు జ‌రిమానా విధించింది ధ‌ర్మాస‌నం.  

Related Articles

Latest Articles